అన్వేషించండి

CUET UG - 2024 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

CUET UG-2024 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 6న విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CUET UG 2024 Advance city intimation slip: దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పరీక్ష కేంద్రానికి సంబంధించిన వివరాలు ఉంటాయి.  

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15 నుంచి 24 వరకు సీయూఈటీ యూజీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతానికి మే 15 నుంచి 18 వరకు జరిగే పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసింది. మే 21, 22, 24 తేదీల్లో జరిగే పరీక్షల ఇంటిమేషన్ స్లిప్స్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇంటిమేషన్ స్లిప్స్‌ విడుదల చేసిన రెండు మూడు రోజుల్లో పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది.

CUET UG - 2024 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' ఫిబ్రవరి 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఫిబ్రవరి 27న ప్రారంభించింది. సరైన అర్హతలున్నవారు మార్చి 26 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. 

పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

సీయూఈటీ యూజీ 2024 పరీక్షల షెడ్యూలు..

ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపుంపరే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపర్తి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్‌నగర్.

సీయూఈటీ యూజీ స్కోరు ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశాలు కల్పిస్తాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ తర్వాత రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ తర్వాత రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ తర్వాత రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ తర్వాత రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Pilla Song - Dhandoraa: లవర్ బాయ్‌గా రవికృష్ణ... మనికా చిక్కాలతో స్టెప్పులు... 'దండోరా'లో 'పిల్లా...' సాంగ్ చూశారా?
లవర్ బాయ్‌గా రవికృష్ణ... మనికా చిక్కాలతో స్టెప్పులు... 'దండోరా'లో 'పిల్లా...' సాంగ్ చూశారా?
Most Sixes In ODIs Rohit Sharma: సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ.. వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు
సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ.. వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు
Embed widget