By: ABP Desam | Updated at : 13 Mar 2023 12:37 PM (IST)
Edited By: omeprakash
సీమ్యాట్ 2023 అప్లికేషన్
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే 'కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2023 దరఖాస్తు గడువు నేటితో (మార్చి 13) ముగియనుంది. ఫిబ్రవరి 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. వాస్తవానికి మార్చి 6తో ముగియాల్సిన గడువును మార్చి 13 వరకు పొడిగిస్తూ ఎన్టీఏ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దరఖాస్తుకోలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
మార్చి 13న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ విండో అందుబాటులో ఉండనుంది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే మార్చి 14 నుంచి 16 వరకు సవరించుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష తేదీని మాత్రం ఇప్పటివరకు ఎన్టీఏ ప్రకటించలేదు. త్వరలోనే పరీక్ష తేదీని వెల్లడించే అవకాశం ఉంది.
వివరాలు..
* కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2023
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు..
➦ జనరల్- బాలురకు రూ.2000, బాలికలకు రూ.1000.చే
➦ జనరల్-EWS /ఓబీసీ(నాన్‌క్రీమిలేయర్)/ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ బాలురకు రూ.1000, బాలికలకు రూ.1000.
➦ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.1000.
పరీక్ష విధానం..
➥ మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 80 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 5 విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు.
➥ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు-800 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-80 మార్కులు, ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ 20 ప్రశ్నలు-80 మార్కులు ఉంటాయి.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ జవాబులు గుర్తించిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కులు ఇస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.03.2023 (05:00 P.M.) (మార్చి 13 వరకు పొడిగించారు)
➥ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 06.03.2023 (11:50 P.M.)
➥ దరఖాస్తుల సవరణ: 07.03.2023 - 09.03.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: ప్రకటించాల్సి ఉంది.
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
➥ పరీక్ష సమయం: 180 నిమిషాలు.
➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.
Also Read:
'నిట్'లో ఎంసీఏ ప్రవేశానికి 'నిమ్‌సెట్', నోటిఫికేషన్ వెల్లడి!
దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) -2023' నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా... వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిట్-జంషెడ్‌పూర్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!