By: ABP Desam | Updated at : 27 Jan 2023 11:59 AM (IST)
Edited By: omeprakash
ఎండీ హోమియో రిజిస్ట్రేషన్
ఆల్‌ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయం జనవరి 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లోని ఆల్ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 27న ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 3న సాయంత్రం 6 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2022 అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.
మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 27న ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలవరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.6000 చెల్లించాల్సి ఉంటుంది.
అర్హతలు..
➥ AIAPGET-2022 ఉత్తీర్ణులై ఉండాలి. పర్సంటైల్ జనరల్-50%, జనరల్(PWD)-45%, ఎస్సీ-ఎస్టీ-40% ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు మేనేజ్‌మెంట్ కోటా కింద ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు.
➥ బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణతతోపాటు, ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. 31.12.2022లోగా ఇంటర్నిషిప్ పూర్తిచేసి ఉండాలి.
➥ఇప్పటికే ఎండీ(హోమియో) చదువతున్నవారు దరఖాస్తు చేసుకునే వీల్లేదు. ఒక స్పెషలైజేషన్‌లో పీజీ (హోమియో) చదువుతున్నవారు మరో స్పెషలైజేషన్ చేరడానికి వీల్లేదు.
రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు (PDF Format)...
(a) AIAPGET-2022 (హోమియో) హాల్‌టికెట్.
(b) AIAPGET-2022 ( హోమియో) ర్యాంకు కార్డు.
(c) పుట్టినతేదీ సర్టిఫికేట్.
(d) స్టడీ సర్టిఫికేట్ – బీహెచ్‌ఎంఎస్(అన్ని సంవత్సరాలవీ)
(e) ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్.
(f ) మార్కుల మెమో – బీహెచ్‌ఎంఎస్(అన్ని సంవత్సరాలవీ)
(g) క్యాస్ట్ సర్టిఫికేట్
(h) కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
(j) ఆధార్ కార్డు
➥ ALL INDAI QUOTA NOTIFICATION
➥ MANAGEMENT QUOTA NOTIFICATION
Also Read:
బీసీ 'విదేశీవిద్య' పథకానికి ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు! వీరు అర్హులు!
తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలె బీసీ 'విదేశీవిద్య' పథకానికి అర్హులైనవారు దరఖాస్తు కోవాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కోరారు. విదేశాల్లో పీజీ చదివేందుకు ఈ పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. విదేశీవిద్య ప్రయోజనం కోరువారు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల వయసు జులై 1 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలను తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని డిగ్రీలో 60 శాతం మార్కులు తెలిపారు.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి కొత్త 'గ్రూపు' అందుబాటులోకి!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంట్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు గుడ్ న్యూస్, డ్యూయల్ డిగ్రీ విధివిధానాలు జారీ!
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్ పేపర్' విషయంలో కీలక నిర్ణయం!
IISc Admissons: ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్
KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
రేవంత్ హౌస్ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు
Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ