అన్వేషించండి

Nobel Prize 2024: 2024లో నోబెల్ పురస్కారానికి ఎంతమంది ఎంపికయ్యారు? పోటీ పరీక్షలకు అవసరమైన కరెంట్ అఫైర్స్ మీ కోసం

Nobel Prize Winners: పోటీ పరీక్షలకు సిద్ధమవుతన్న అభ్యర్థుల కోసం నోబెల్ ప్రైజ్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తున్నాం. పరీక్షకు వెళ్లే ముందు ఒక్కసారి వీటిని చదువుకోండి

NOBEL AWARDS 2024 Current Affairs: ఈ మధ్య కాలంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు. ఆరు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలు త్వరలోనే పురస్కారం అందుకోనున్నారు. దీనికి సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను ఏబీపీ దేశం మీకు అందిస్తోంది.  

1. ప్రపంచ అత్యున్నత పురస్కారంగా నోబెల్ పురస్కారాన్ని పిలుస్తారు, అయితే ఈ పురస్కారం ఎవరి పేరు మీద ఇస్తారు?--ఆల్ఫ్రెడ్ నోబెల్ (స్వీడన్) 

2. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు?--స్వీడన్ దేశానికి చెందిన ఒక రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యాపారవేత్త మరియు మానవతావాది. 

3. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏ ఆయుధాలు తయారు చేసిన సంస్థకు చెందిన వ్యాపారవేత్త?--బోఫోర్స్

4. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆవిష్కరించిన రసాయన విస్ఫోటనం పేరు?--డైనమైట్ 

5. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన మరణానికి సంవత్సరం ముందుగా వీలునామా ఎప్పుడు రాశారు?--1895 నవంబర్ 27 

6. ప్రపంచ అత్యున్నత పురస్కారం మైన నోబెల్ ఏ రోజున ప్రధానం చేస్తారు?--డిసెంబర్ 10 (1896 డిసెంబర్ 10 నోబెల్ మరణం) 

7. నోబెల్ పురస్కారం అందజేయు దేశాలు ఏవి?--స్వీడన్, నార్వే. 

8. నోబెల్ పురస్కారం మొదటిగా ఎన్ని రంగాల్లో ఇచ్చేవారు?--ఐదు రంగాలు(1901)

9.  ఆరో రంగమైన అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు?--1969(1968 అర్థశాస్త్రానికి అవకాశం కల్పించారు)

10. ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అయినా రిక్స్ బ్యాంక్ (స్వీడన్1668)ఏర్పాటుచేసి 300 సంవత్సరాాలు పూర్తైన సందర్భంగా ఏ రంగానికి అవకాశం  కల్పించారు ?- ఆర్థిక శాస్త్రం 

11. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ అత్యున్నత పురస్కారం అయిన నోబెల్ పురస్కారానికి ఎంతమంది ఎంపికయ్యారు?--12 మంది (దీనిలో ఒక సంస్థ, ఒక మహిళ ఉన్నారు)

12. నోబెల్ పురస్కారం గరిష్టంగా ఒక రంగంలో ఎంతమందిని ఎంపిక చేస్తారు?--ముగ్గురు (పారితోషకం సమానంగా పంచుతారు.) 

13. నోబెల్ పురస్కారంతో పాటుగా ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది?--11 మిలియన్ల స్వీడిష్ క్రోన్, లేక (10 లక్షల అమెరికన్ డాలర్లు )(భారతదేశ కరెన్సీ రూపంలో 8.8 కోట్లు)

14. నోబెల్ శాంతి పురస్కారం ఏ నగరంలో ప్రధానం చేస్తారు?--నార్వే రాజధాని   ఓస్లో (మిగతావి స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ప్రధానం చేస్తారు) 

15. నోబెల్ బహుమతులను ప్రతి సంవత్సరం ఏ నెలలో ప్రకటిస్తారు?--అక్టోబర్ నెల మొదటి వారంలో వరుసగా (MPCLPE)M-Medicine, P-Physics,C-Chemistry, L-Literature,P-peace, E-Economics.

16. నోబెల్ పురస్కారము అందుకున్న గ్రహీతను ఏమని పిలుస్తారు?--LAUREATE అంటారు

17. 2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైన వారు?--విక్టర్ అంబ్రోస్, గ్యారీ రవ్ కున్(అమెరికా) 

18. ఏ అవిష్కరణకు 2024 వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది?--మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు గాను, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలను అందించడం

19. కృత్రిమ మేధ (AI) ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్ వర్క్ లో మిషన్ లెర్నింగ్ (ML) ఆవిష్కరణలకు గాను 2024 భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను నోబెల్ పురస్కారానికి ఎంపికైన శాస్త్రవేత్తలు ఎవరు?--జాన్  జె.హోప్ ఫీల్డ్, జెప్రీ ఈ హింటన్

20. Godfather of AI ఎవరిని పిలుస్తారు?--జెఫ్రీ ఈ హింటన్ (కెనడా) 

21. 2024 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో విశేష పరిశోధన జరిపిన ఏ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం వరించింది?--డేవిడ్ బేకర్ (కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్) డేమిస్ హసాబిస్, జాన్ .ఎం.జంపర్(ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ కు)

22. సాహిత్యములో విశేష కృషి  చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి  కి 2024 సంవత్సరానికి గాను నోబెల్  పురస్కారం వరించింది అయితే ఆమె పేరు?--హాన్ కాంగ్ (ది వెజిటేరియన్, ది వైట్ బుక్, హ్యూమన్ యాక్ట్స్ మరియు గ్రీక్ లెసన్స్. రాసిన పుస్తకాలు) 

23. 2024 సంవత్సరానికి గాను ఏ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి వరించింది?--నిహాన్ హిడాం క్యో(జపాన్) 

24. జపాన్ లో "హిబాకుషా"అని ఎవరిని పిలుస్తారు?-1945 ఆగస్ట్ 6, ఆగస్టు 9 జరిగిన హీరోషిమా, నాగసాకి అను బాంబుల దాటికి ప్రాణాలతో బ్రతికి ఉన్నవారు 

25. 2024 సంవత్సరానికి గాను ఆర్థశాస్త్రంలో ఆర్థిక అసమానుతులపై పరిశోధనకు గాను ముగ్గురిని నోబెల్ పురస్కారం వరించింది అయితే వారి పేర్లు?--డేరెన్ ఏస్ మోగ్లు(టర్కీ), సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ (అమెరికా) 

26. సంస్థలు ఏ విధంగా ఏర్పడతాయి, సమాజ శ్రేయస్సు ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై పరిశోధన గాను 2024 అర్థశాస్త్రము లో నోబెల్ పురస్కారం వరించింది. అయితే ఏస్ మోగ్లు, రాబిన్ సన్స్ కలిసి 2012లో రాసిన పుస్తకం పేరు?--వై నేషన్స్ ఫెయిల్-ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పర్టీ అండ్ పావర్టీ.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Embed widget