NIRF Ranking 2022 List: ఉత్తమ విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్- యూనివర్సిటీల్లో బెంగళూరు టాప్
NIRF Ranking 2022 List: దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ (IIT Madras) మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.
NIRF Ranking 2022 List: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2022 సంవత్సరానికి గానూ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ రిలీజ్ చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐటీలే హవా కొనసాగించాయి. ఉత్తమ విద్యా సంస్థల ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాసు మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
తర్వాతి స్థానాల్లో
బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రెండవ స్థానంలో నిలిచింది ఐఐటీ బాంబే మూడవ స్థానం సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేశారు. అయితే టాప్ 10లో ఆరు స్థానాలను ఐఐటీలే గెలుచుకోవడం విశేషం. గత ఏడాది టాప్ 10లో లేని దిల్లీ ఎయిమ్స్ ఈసారి 9వ స్థానంలో నిలిచింది.
టాప్ 10 జాబితా
1 | ఐఐటీ మద్రాస్ (IIT Madras) | తమిళనాడు |
2 | ఐఐఎస్‌సీ బెంగళూరు (IISC Bengaluru) | కర్ణాటక |
3 | ఐఐటీ బాంబే (IIT Bombay) | మహారాష్ట్ర |
4 | ఐఐటీ దిల్లీ (IIT Delhi) | దిల్లీ |
5 | ఐఐటీ కాన్పుర్ (IIT Kanpur) | ఉత్తర్‌ప్రదేశ్ |
6 | ఐఐటీ ఖరగ్‌పుర్ (IIT Kharagpur) | బంగాల్ |
7 | ఐఐటీ రూర్‌కీ (IIT Roorkee) | ఉత్తరాఖండ్ |
8 | ఐఐటీ గువాహటీ (IIT Guwahati) | అసోం |
9 | జేఎన్‌యూ | దిల్లీ |
10 | ఎయిమ్స్ దిల్లీ | దిల్లీ |
యూనివర్సిటీల్లో
బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) టాప్ యూనివర్సిటీగా నిలిచింది. దిల్లీకి చెందిన జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలు వరుసగా రెండవ, మూడు ర్యాంకుల్లో నిలిచాయి.
మొత్తం 11 క్యాటగిరీల్లో ర్యాంకులను ప్రకటిస్తారు. ఓవరాల్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, కాలేజీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా, డెంటల్, రీసర్చ్ క్యాటగిరీల్లో ర్యాంకులను ప్రకటించారు.
హైదరాబాద్‌కు
ఫార్మసీ క్యాటగిరీలో హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ మూడవ ర్యాంక్‌లో నిలిచింది. ఈ క్యాటిరీలో జామియా హమ్‌దర్ద్ టాప్ ప్లేస్ సాధించింది.
Also Read: Nupur Sharma Remarks Row: అజ్మేర్ దర్గా ఖాదీమ్ సయ్యద్ చిస్తీ హైదరాబాద్‌లో అరెస్ట్
Also Read: Trump vs Elon Musk: 'మస్క్‌ను మోకాళ్లపై నిలబడి అడుక్కోమనాల్సింది' - ట్రంప్ కౌంటర్ మామూలుగా లేదు!