NIMS Admissions: నిమ్స్‌లో బీఎస్సీ, బీపీటీ కోర్సులు.. చివరితేది ఎప్పుడంటే?
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీపీటీ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీపీటీ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల వివరాలు...
1) బీఎస్సీ (పారామెడికల్ అలైడ్ సైన్సెస్)
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు. కోర్సు పూర్తయిన వారు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు.
సీట్ల సంఖ్య: 100.
విభాగాలు-సీట్లు: అనస్తీషియా టెక్నాలజీ-10, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ-20, కార్డియో వాస్కులర్ టెక్నాలజీ-12, ఎమర్జెన్సీ & ట్రామా కేర్ టెక్నాలజీ-08, రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ-10, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ-12, న్యూరో టెక్నాలజీ-06, ఫెర్ఫ్యూజన్ టెక్నాలజీ-04, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ-04, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ-10, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్-04.
అర్హత: ఇంటర్ (బైపీసీ - బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 31-12-2022 నాటికి 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
సీబీఎస్‌ఈ ఫలితాలపై, కళాశాలలకు యూజీసీ కీలక సూచన!!
2) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)
కోర్సు వ్యవధి: 4.5 సంవత్సరాలు (ఇంటర్న్‌షిప్‌తో పాటు) .
సీట్ల సంఖ్య: 50.
అర్హత: ఇంటర్ (బైపీసీ - బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బయాలజీ, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులతో ఒకేషనల్ ఫిజియోథెరపీ కోర్సు చేసి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 31-12-2022 నాటికి 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
3) బీఎస్సీ (నర్సింగ్)- మహిళలకు మాత్రమే
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
సీట్ల సంఖ్య: 100.
అర్హత: ఇంటర్ (బైపీసీ) బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఉండాలి. ఓపెన్ స్కూల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్‌లో ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి. అభ్యర్థులకు మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి. వివాహమైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 31-12-2022 నాటికి 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తయిన తర్వాత.. ప్రింట్ తీసిన కాపీలను ''The Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad-500082" చిరునామాలో ఆగస్టు 4న సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.700.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.07.2022
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.08.2022
* దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 04.08.2022
* బీఎస్సీ (పారామెడికల్) ప్రవేశ పరీక్ష తేది: 16.10.2022
* బీపీటీ ప్రవేశ పరీక్ష తేది: 04.09.2022
* బీఎస్సీ (నర్సింగ్) ప్రవేశ పరీక్ష తేది: 18.09.2022.
నీట్ యూజీ హాల్‌టిక్కెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండి!!