![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NEET UG 2024: నీట్ యూజీ - 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NEET UG 2024: నీట్-యూజీ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మే 5న నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించనున్నారు.
![NEET UG 2024: నీట్ యూజీ - 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి neet ug 2024 city intimation slip released check direct link here to download NEET UG 2024: నీట్ యూజీ - 2024 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/1a5414031075b673be4cd24ada9924831713959614971522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NEET UG 2024 Exam City Slip: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్-యూజీ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో నమోదుచేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లో అభ్యర్థులు పరీక్ష రాసే నగరం, పరీక్ష తేదీ, విధి విధానాలు, తదితర వివరాలు ఉంటాయి. త్వరలో అడ్మిట్ కార్డులు (NEET UG Admit Card) విడుదల కానున్నాయి.
పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 557 నగరాలు/పట్టణాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో మే 5న నిర్వహించనున్న నీట్ పరీక్షకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మే 5న మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 200 నిమిషాలు (3 గంటల 20 నిమిషాలు). ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్ (BDS), బీఎస్‌ఎంఎస్ (BSMS), బీయూఎంఎస్ (BUMS), బీహెచ్‌ఎంఎస్ (BHMS) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షను దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 22 లక్షలకుపైగా విద్యార్థులు రాసే అవకాశం ఉందని అంచనా.
ALSO READ: నీట్(యూజీ) సిలబస్ తగ్గింపు, ఈ సబ్జెక్టుల్లోనే ఎక్కువ కోత - విద్యార్థులపై తగ్గిన భారం!
సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'NEET (UG) 2024 City Display' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి SUBMIT బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే అభ్యర్థులకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ కనిపిస్తుంది.
➥ అభ్యర్థులు స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
➥ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లో అభ్యర్థి వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలు చూసుకోవచ్చు.
Direct Link: NEET UG 2024 Exam City Slip
నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.
➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.
➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.
➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)