అన్వేషించండి

AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌-2024, పరీక్ష వివరాలు ఇలా

దేశంలోని ఆయుష్‌ కళాశాలలు, విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను 'ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలున్నవారు మే 15లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.

AIAPGET 2024: దేశంలోని ఆయుష్‌ కళాశాలలు, విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌ కోర్సు ప్రవేశాలకు సంబంధించి 'ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (AIAPGET)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఏఎంఎస్‌ (BAMS), బీయూఎంఎస్‌ (BUMS), బీఎస్‌ఎంఎస్‌ (BSMS), బీహెచ్‌ఎంఎస్‌ (BHMS), గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్‌ (Graded BHMS) డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అర్హులు.

సరైన అర్హతలున్నవారు మే 15లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే మే 16 వరకు నిర్ణీత ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్థులు రూ.2700; ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ(ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు రూ.2450; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1800; థర్డ్ జెండర్‌ అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 2 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఏపీలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు..

* ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024

అర్హత: బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.2700; ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ(ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు రూ.2450; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1800; థర్డ్ జెండర్‌ అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి.

పరీక్ష విధానం: మొత్తం 480 మార్కులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఆయుర్వేదం పేపరును ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో; హోమియోపతి పేపరును ఇంగ్లిష్; సిద్దా పేపరును ఇంగ్లిష్, తమిళంలో; యునానీ పేపరును ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.05.2024.

➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 16.05.2024. (11:50 P.M.)

➥ దరఖాస్తు సవరణకు అవకాశం: 17.05.2024 - 19.05.2024 వరకు.

➥ అడ్మిట్ కార్డులు విడుదల: 02.07.2024 నుంచి.

➥ పరీక్ష తేదీ: 06.07.2024. 

 Notification

Online Registration

Website

ALSO READ:

ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు
చెన్నైలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2024-25 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు గేట్‌/ సీయూఈటీ/ పీజీ సెట్‌/ క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు ఉండాలి. ఐఎంయూ సెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఐఎంయూ క్యాంపస్‌లు నవీ ముంబయి, ముంబయి పోర్ట్, కోల్‌కతా, విశాఖపట్నం, చెన్నై, కొచ్చిలో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్ షాక్ - ఆ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు, భారతీయులకు బిగ్ రిలీఫ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్ షాక్ - ఆ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు, భారతీయులకు బిగ్ రిలీఫ్
Gandhi Tatha Chettu Review - గాంధీ తాత చెట్టు రివ్యూ: గాంధీ గిరితో వచ్చిన 'పుష్ప 2' దర్శకుడు సుక్కు కుమార్తె... అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
గాంధీ తాత చెట్టు రివ్యూ: గాంధీ గిరితో వచ్చిన 'పుష్ప 2' దర్శకుడు సుక్కు కుమార్తె... అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bihar DEO Bundles of Cash | అధికారి ఇంట్లో తనిఖీలు..నోట్ల కట్టలు చూసి షాక్ | ABP DesamRam Gopal Varma Convicted Jail | సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీకి జైలు శిక్ష | ABP DesamNara Lokesh Davos Interview | దావోస్ సదస్సుతో ఏపీ కమ్ బ్యాక్ ఇస్తుందన్న లోకేశ్ | ABP DesamCM Chandrababu Naidu Davos Interview | మనం పెట్టుబడులు అడగటం కాదు..మనోళ్లే ఎదురు పెడుతున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్ షాక్ - ఆ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు, భారతీయులకు బిగ్ రిలీఫ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్ షాక్ - ఆ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు, భారతీయులకు బిగ్ రిలీఫ్
Gandhi Tatha Chettu Review - గాంధీ తాత చెట్టు రివ్యూ: గాంధీ గిరితో వచ్చిన 'పుష్ప 2' దర్శకుడు సుక్కు కుమార్తె... అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
గాంధీ తాత చెట్టు రివ్యూ: గాంధీ గిరితో వచ్చిన 'పుష్ప 2' దర్శకుడు సుక్కు కుమార్తె... అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Heavy Fog: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు - వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు - వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
Meerpet News Today: మీర్‌పేట హత్య కేసులో బిగ్ ట్విస్ట్- గురుమూర్తి సెల్‌ఫోన్‌ చూసిన షాకైన పోలీసులు
మీర్‌పేట హత్య కేసులో బిగ్ ట్విస్ట్- గురుమూర్తి సెల్‌ఫోన్‌ చూసిన షాకైన పోలీసులు
Fire Accident: మాదాపూర్ మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కార్లు, భారీగా ఆస్తి నష్టం
మాదాపూర్ మహీంద్రా కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కార్లు, భారీగా ఆస్తి నష్టం
Embed widget