అన్వేషించండి

AP: టోఫెల్‌, ఐబీతో ఒప్పందాలకు టెండర్లు అక్కర్లేదు, మంత్రి బొత్స క్లారిటీ

ఏపీలో టోఫెల్(ఈటీఎస్), ఇంటర్నేషనల్ బాకలారియట్(ఐబీ) సంస్థల ఎంపికకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఏపీలో టోఫెల్(ఈటీఎస్), ఇంటర్నేషనల్ బాకలారియట్(ఐబీ) సంస్థల ఎంపికకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతిదానికి టెండర్ అవసరం లేదని, తాము దీన్ని సమర్థించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. టోఫెల్, ఐబీ అత్యుత్తమమని భావిస్తున్నామని.. అందుకే ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని ముందుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. 

ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేశామని. ఈ కమిటీ సూచనతో ఐబీని ఎంపిక చేసి, రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో ఐబీ అమలుపై అధ్యయనం చేసేందుకు ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. ఇందులో ఆర్థిక సంబంధమైన అంశాలు గానీ, ఈ స్థాయిలో చెల్లింపులు గానీ ఏమీ లేవు. అధ్యయనానికి ఆరు నెలలు సమయం ఉందని, ఆ తర్వాతే అమలుకు ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. 

ఐబీ, టోఫెల్ అమలుతో ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనే ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదవారికి నాణ్యమైన విద్య అందకూడదా? అని మంత్రి ప్రశ్నించాలరు. ఐబీని మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఐబీ అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. 

రాష్ట్ర బోర్డు, ఐబీ కలిసి సంయుక్తంగా సర్టిఫికేషన్ ఇవ్వనున్నాయని, టోఫెల్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు. ఎవరేమనుకున్నా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రభుత్వం అన్నీ పారదర్శకంగా చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

ALSO READ:

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, గ్రూప్-2లో భారీగా పెరిగిన పోస్టులు
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అన్ని విభాగాల నుంచి మరోసారి ఖాళీల వివరాలను తెప్పించుకున్న జీఎడీ, పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీలోని ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అక్టోబరు 21న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్‌ జారీ చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget