APPSC: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, గ్రూప్-2లో భారీగా పెరిగిన పోస్టులు
AP Group 2 Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Group-2 Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అన్ని విభాగాల నుంచి మరోసారి ఖాళీల వివరాలను తెప్పించుకున్న జీఎడీ, పరిశీలన తర్వాత అదనంగా 212 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మొత్తం 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది.
ఏపీలోని ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అక్టోబరు 21న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. పదవి విరమణ సమయంలో మూల వేతనం లో 50 శాతం పెన్షన్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.
ALSO READ:
ఆప్కాబ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..