BC Overseas Scholarships: బీసీ 'విదేశీవిద్య' పథకానికి సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులు, వీరు మాత్రమే అర్హులు
తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలె బీసీ 'విదేశీవిద్య' పథకానికి అర్హులైనవారు దరఖాస్తు కోవాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆగస్టు 17న ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలె బీసీ 'విదేశీవిద్య' పథకానికి అర్హులైనవారు దరఖాస్తు కోవాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆగస్టు 17న ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో పీజీ చదివేందుకు ఈ పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. విదేశీవిద్య ప్రయోజనం కోరువారు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్‌సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్‌సైన్సెస్, హ్యుమానిటీస్ రంగాల్లో 60 శాతం మార్కులు పొందినవారు దరఖాస్తుకు అర్హులు. విదేశీ యూనివర్సిటీలో ప్రవేశానికి ఆహ్వానం(ఐ-20), వీసా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ-పాస్ వెబ్‌సైట్ చూడవచ్చు.
పథకానికి అర్హతలివే..
➥ డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో తగిన స్కోరు ఉండాలి. ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ టెస్ట్ అర్హత సాధించాల్సి ఉంటుంది.
➥ విద్యార్థుల వయసు 01.07.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
➥ కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి.
➥ కుటుబంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
➥ పథకానికి ఎంపికైన విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని
యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందుతారు. * పథకానికి అర్హత సాధించిన వారికి 20 లక్షల రూపాయల వరకు విదేశీ విద్య సాయం అందుతుంది. ఇతర రాయితీలు కూడా వర్తిస్తాయి.
ALSO READ:
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-2023 నోటిఫికేషన్, పరీక్ష ఎప్పుడంటే?
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సు, ఇంటర్ అర్హత చాలు
గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 2లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..