Which Course Is Best After 12 Science: బైపీసీ తర్వాత చేయటానికి తిరుగులేని కోర్సులున్నాయి..తప్పక తెలుసుకోండి
Which Study Is Best For Future After Intermediate: ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవుతానంటేనే బైపీసీ చదువు అనే కాలం పోయింది. ఇంటర్‌లో బైపీసీ కోర్సు తీసుకున్న విద్యార్థులకు ఇపుడు ఎన్నెన్నో అవకాశాలున్నాయి.
Which Subject Is Best For 12th Science: బైపీసీ చదువుకుంటేనే ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవుతాననే కాలం పోయింది. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ కోర్సు తీసుకున్న విద్యార్థులకు ఇపుడు ఎన్నెన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మెడిసన్ చేసేంత ఆర్థికస్థోమత లేకపోయినా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న కోర్సులివి.
మెడిసన్ చదవాలంటే నీట్ స్కోర్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అందులో స్కోర్ సంపాదించటం సామాన్యమైన విషయం కాదు. మెడిసన్ సీట్ రాలేదని విద్యార్థులు నీరుగారి పోకుండా ఎంతో గొప్ప ఫ్యూచర్ ఉండే కోర్సులు ఇప్పుడు బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి.
ఫిజియోథెరపీ
ఈ మధ్యకాలంలో ఫిజియోథెరపీ మునుపటి కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు పెరుగుతున్న రంగం. ఎంబీబీయెస్ లో సీట్ వచ్చినా రాకపోయినా, వైద్యరంగంలో ఉండాలనే మక్కువ ఉన్న విద్యార్థులకు ఇది మంచి ఆప్షన్. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ) కోర్సులో చేరటానికి కాలేజీని బట్టి, ఇంటర్ మెరిట్ గానీ, ఎంసెట్ గానీ, నీట్ స్కోర్ ఆధారంగా గానీ చేర్చుకుంటారు. లేదా ఎంట్రన్స్ ఎగ్జాం ద్వారా గానీ ప్రవేశం లభిస్తుంది. బీపీటీ అయిపోయాక, ఎంపీటీలో చేరాల్సి ఉంటుంది. అక్కడ నచ్చిన స్పెషలైజేషన్ తీసుకొని తర్వాత ఫిజియోథెరపీ రంగంలో రాణించవచ్చు.
బీఎస్సీ నర్సింగ్
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక అత్యంత ఆదరణ కలిగి, ఎక్కువ మంది చేరుతున్న కోర్సు బీఎస్సీ నర్సింగ్. ఇంటర్‌లో 45 శాతం మార్కులతో పాస్ అయితే చాలు.. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఆఫర్ చేస్తున్నాయి. ఇది నాలుగేళ్ల కోర్సు. ఎంసెట్/నీట్ స్కోర్‌తో మంచి కాలేజీల్లో అవకాశం వస్తుంది. ఒక వేళ బీఎస్సీ నర్సింగ్ లో సీట్ దొరకని విద్యార్థులకు ANM, GNM కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
బీఫార్మసీ
బీఫార్మసీ ఎప్పుడూ ఆదరణ ఉన్న కోర్సే. ఔషధ పరిశ్రమలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎక్కువ మందే ఉంటారు. ప్రత్యేకించి మెడిసన్ కోసం కాకుండా బీఫార్మసీలో చేరటానికి ఇంటర్‌లో బైపీసీ చదివే వారూ ఎక్కువే. అందుకే బైపీసీ విద్యార్థులకు ఈ కోర్సులో చేరటానికి సగం సీట్లు కేటాయించారు. ఎంసెట్ స్కోరు ఆధారంగా బీఫార్మసీలో చేరొచ్చు. తర్వాత ఎంఫార్మసీ పూర్తిచేసి ఔషధ రంగంలో కొనసాగవచ్చు.
పారా మెడికల్
అతి తక్కువ సమయలో కోర్సు పూర్తి చేసుకొని, కోర్సు అయిన వెంటనే బోలెడన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సు పారా మెడికల్. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ, స్లీప్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, రేడియో థెరపీ, డెంటల్ హైజీనిస్ట్, ఆర్థోపెడిక్ టెక్నాలజీ ఇలా కొన్ని వందల రకాల స్పెషలైజేషన్స్ పారా మెడికల్ కోర్సులో అందుబాటులో ఉన్నాయి. కోర్సును బట్టి మూడు నాలుగేళ్ళ వ్యవధి ఉంటాయి. ఇవి కాకుండా డిప్లొమా కోర్సులు అయితే రెండేళ్ళలో పూర్తయిపోతుంది. ఎంట్రన్స్ మెరిట్ ఆధారంగా గానీ, ఇంటర్ మార్కుల ఆధారంగా గానీ సీటు ఇస్తారు.
బైపీసీ తో సంబంధం లేని కోర్సులు
బైపీసీ చదివి సైన్సుతో సంబంధం లేని కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కూడా ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. లా కోర్సులు, సీఏ, బీబీఏ, బీబీయెం కోర్సులు మెడిసిన్ తో సమానమైన ఆదరణ కలిగిన కోర్సులు. వీటితో పాటూ, ఫారిన్ లాంగ్వెజ్ కోర్సులు, ఫ్యాషన్ డిజైనింగ్, లిబరల్ స్టడీస్ వంటి ప్రాముఖ్యమున్న కోర్సులు కూడా ఎంచుకోవచ్చు.