LIC HFL Vidyadhan Scholarship: విద్యార్థి చదువుకు ఉపకారం, ‘విద్యాధనం’ స్కాలర్‌షిప్!
ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ పరీక్షల్లో 65 శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి.
చదువులో ప్రతిభ ఉండి, ఆర్థికంగా వెనుకబడిన ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటమే LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ ముఖ్య ఉద్దేశం. మూడు కేటగిరీలుగా ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.
ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ పరీక్షల్లో 65 శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.6 లక్షలకు మించకూడదు. కోవిడ్ కారణంగా ప్రభావితమైన పిల్లల చదువుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు.
Read Also: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ స్కాలర్‌షిప్
స్కాలర్‌షిప్ విలువ: ఇంటర్ విద్యార్థులకు (2 సంవత్సరా పాటు) ఏడాదికి రూ.10,000; డిగ్రీ విద్యార్థులకు 3 సంవత్సరాలపాటు ఏడాదికి రూ.15,000; పీజీ విద్యార్థులకు 2 సంవత్సరాలపాటు ఏడాదికి రూ.20,000 ఆర్థికసాయం అందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్ధితులకు అనుగుణంగా విద్యార్థులు ప్రాథమిక వడపోత ఉంటుంది. వీరికి ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
చివరితేది: 30-09-2022.
Notification & Online Aplication
Read Also: పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?
బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్..
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం.
అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు
తెలంగాణలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా.. ఇంటర్, ఆ పైన చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మైనారిటీ విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2008లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం
-కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది.
-కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను ఇస్తుంది.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2007లో ప్రారంభించారు.
-100 శాతం కేంద్రమే నిధులను సమకూరుస్తుంది.
-2007లో మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ని ప్రారంభించారు. ఈ పథకం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించింది.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..