TSLAWCET 2023: టీఎస్ లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు, ఫైన్ లేకుండా చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ఏప్రిల్ 6న ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20లోపు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టీఎస్ లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ గురువారం (ఏప్రిల్ 6) ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20లోపు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ మార్చి 1న విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుకు గడువు ఉంది. అయితే ఆ గడువును ఏప్రిల్ 20 పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600, ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ.900గా నిర్ధారించించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.1000తో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10 వరకు అవకాశం కల్పించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 01-03-2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-03-2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20-04-2923.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 26-04-2023.
➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 01-05-2023.
➥ రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 05-05-2023.
➥ రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 10-05-2023.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04-05-2023 నుంచి 10-05-2023 వరకు.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 16-05-2023.
➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 25-05-2023.
➥ ప్రాథమిక కీ విడుదల: 29-05-2023.
➥ ప్రాథమిక ఆన్సర్ కీ అభ్యంతరాల గడువు: 31-05-2023 (5 PM)
➥ తుది కీ, ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.
పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.
నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Also Read:
Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.