అన్వేషించండి

KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్‌ కోటా అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల, ఇక్కడ చూసుకోండి

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న విడుదల చేసింది.

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన 44,629 మంది అర్హత పొందారు. వీరిలో 22,167 మంది కన్వీనర్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 15,016 అమ్మాయిలు ఉండగా 7,151 మంది అబ్బాయిలు ఉన్నారు. 

నీట్-యూజీ టాప్ ట్యాంకర్లలో వందలోపు ర్యాంకు సాధించిన ముగ్గురు రాష్ట్రంలో కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో 15వ ర్యాంకర్ కాంచాని గేయాంత్ రఘురాంరెడ్డి, 52వ ర్యాంకర్ లక్ష్మీరశ్మిత గండికోట, 68వ ర్యాంకర్ దేవగుడి గురుశశిధర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

జాతీయ స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన వారిలో 31 మంది రాష్ట్ర కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆలిండియా కోటా సీట్ల భర్తీ మొదటిరౌండ్ జులై 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో జాతీయ కోటా మొదటిరౌండ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటిరౌండ్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

MBBS/BDS Provisional Merit List

List of Not Eligible Candidates

CAP Eligible Candidates List As Received From Sainik Welfare Department

ALSO READ:

నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, నాలుగు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆల్‌ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేవారు రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఫీజులు ఖరారు, ఫీజులు ఎంతమేర పెరిగాయంటే?
ఏపీలో 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, డెంటల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జులై 25న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులను 10 శాతం పెంచుతూ కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget