అన్వేషించండి

TS EAPCET 2024 ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా - విద్యార్థులకు ముఖ్యసూచనలు

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన హాల్‌టికెట్లను జేఎన్‌టీయూహెచ్ మే 1న విడుదల చేసింది.

TS EAPCET HallTickets: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన హాల్‌టికెట్లను జేఎన్‌టీయూహెచ్ మే 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 29న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంజినీరింగ్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 7 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా విభాగాలకు;  మే 9, 10, 11వ తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఫలితాలను మే నెలాఖరులో విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్‌ పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నారు. విభజన చట్టం జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది. అంతకంటే ముందే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయినందున ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.

TS EAPCET - 2024 HALL TICKETS

అబ్బాయిల ఛాయిస్ ఇంజినీరింగ్.. మరి అమ్మాయిలు? 
టీఎస్‌ఎప్‌సెట్‌కు సంబంధించి ఎక్కువమంది అబ్బాయిలు ఇంజినీరింగ్ వైపు ఆసక్తి చూపుతుంటే.. అమ్మాయిలు మాత్రం.. అగ్రికల్చర్‌, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులవైపు ఆకర్షితులవుతున్నారు. ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షకు మొత్తం 1,50,600 (60 శాతం) మంది అబ్బాయిలు దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,03,862 (40 శాతం) మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి అమ్మాయిలు 73,224 (73 శాతం) మంది దరఖాస్తు చేసుకోగా.. అబ్బాయిలు కేవలం 27,003 (27 శాతం) మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. గతేడాది కంటే ఈసారి ఇంజినీరింగ్‌కు దరఖాస్తుల సంఖ్య పెరిగితే.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు మాత్రం తగ్గాయి. 

పరీక్ష కేంద్రాలివే...
ఎప్‌సెట్ పరీక్షల కోసం తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలోని కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 135 కేంద్రాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ; 166 కేంద్రాల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు

విద్యార్థులకు ముఖ్య సూచనలు..
➥ ఈసారి పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుచేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు.

➥ పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.  

➥  సెల్‌ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 

➥ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

➥ అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించరు. 

➥ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు లేదా కాలేజీ ఐడీ కార్డును పరీక్ష రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. 

➥ అభ్యర్థులు హాల్‌‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

➥ పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్‌టికెట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget