అన్వేషించండి

JEE Main: జేఈఈ మెయిన్‌ విద్యార్థులకు అలర్ట్ - ఆ తేదీ పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JEE Main మొదటి విడత పరీక్షకు సంబంధించి మిగతా తేదీల అడ్మిట్‌ కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచింది.

JEE Main 2025 Admitcard: జేఈఈ మెయిన్-2025 మొదటి విడత పరీక్షకు సంబంధించి జనవరి 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పరీక్షల అడ్మిట్‌కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)'  విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 13.8 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. దేశవ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జనవరి 24 వరకు పరీక్షలు ముగియగా.. జనవరి 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇక జనవరి 30న పేపర్‌ 2ఏ (బీఆర్క్‌), పేపర్‌ 2బీ (బీ ప్లానింగ్‌), పేపర్‌ 2ఏ, 2బీ (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ రెండింటికి) పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. ఇక జనవరి 31 తేదీన సెకండ్‌ షిఫ్ట్‌లో బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ పేపర్‌ 2ఏ, 2బీ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయి.

JEE Main 2025 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం..

➥పేపర్‌-1(బీటెక్, బీఈ) పరీక్ష
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్‌-ఎ 20 మార్కులు, సెక్షన్‌-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో  బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు. 

➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి. 

➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు..
తెలంగాణలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏపీలో అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, మంగళగిరి, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం తదితర చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

JEE Main: జేఈఈ మెయిన్‌ విద్యార్థులకు అలర్ట్ - ఆ తేదీ పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoist Latest News: కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎందుకు ఎగరేశారు? దండకారణ్యం పట్టుచిక్కినట్టేనా?
కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎందుకు ఎగరేశారు? దండకారణ్యం పట్టుచిక్కినట్టేనా?
Hit 3 :  'హిట్ 3' నాని , శ్రీనిథి క్యూట్ మూమెంట్స్ - గట్టిగానే హిట్ కొట్టారు!
'హిట్ 3' నాని , శ్రీనిథి క్యూట్ మూమెంట్స్ - గట్టిగానే హిట్ కొట్టారు!
Andhra Pradesh DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్- 421 పోస్టులు నేరుగా భర్తీ 
డీఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్- 421 పోస్టులు నేరుగా భర్తీ 
Balakrishna BMW Car: బాలకృష్ణ కొత్త బీఎండబ్ల్యూ కార్ చూశారా? - రూ.7.75 లక్షల ఫ్యాన్సీ నెంబర్‌తో..
బాలకృష్ణ కొత్త బీఎండబ్ల్యూ కార్ చూశారా? - రూ.7.75 లక్షల ఫ్యాన్సీ నెంబర్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Yuzvendra Chahal Hattrick vs CSK IPL 2025 | హ్యాట్రిక్ తో మెరిసిన ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్MS Dhoni Will Play IPL 2026 | ఐపీఎల్ లో తన ఫ్యూచర్ పై క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీSam Curran 88 vs PBKS IPL 2025 | పంజాబ్ పై 88పరుగులతో శామ్ కర్రన్ వైల్డ్ ఫైర్CSK Eliminated From IPL 2025 | ఐపీఎల్ 2025 నుంచి ఎలిమినేట్ అయిన సీఎస్కే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Latest News: కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎందుకు ఎగరేశారు? దండకారణ్యం పట్టుచిక్కినట్టేనా?
కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎందుకు ఎగరేశారు? దండకారణ్యం పట్టుచిక్కినట్టేనా?
Hit 3 :  'హిట్ 3' నాని , శ్రీనిథి క్యూట్ మూమెంట్స్ - గట్టిగానే హిట్ కొట్టారు!
'హిట్ 3' నాని , శ్రీనిథి క్యూట్ మూమెంట్స్ - గట్టిగానే హిట్ కొట్టారు!
Andhra Pradesh DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్- 421 పోస్టులు నేరుగా భర్తీ 
డీఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్- 421 పోస్టులు నేరుగా భర్తీ 
Balakrishna BMW Car: బాలకృష్ణ కొత్త బీఎండబ్ల్యూ కార్ చూశారా? - రూ.7.75 లక్షల ఫ్యాన్సీ నెంబర్‌తో..
బాలకృష్ణ కొత్త బీఎండబ్ల్యూ కార్ చూశారా? - రూ.7.75 లక్షల ఫ్యాన్సీ నెంబర్‌తో..
Revanth Reddy Latest News: ఫామ్‌ హౌస్‌లో పడుకోవడానికా రూ.65 లక్షలు ఇస్తోంది? కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
ఫామ్‌ హౌస్‌లో పడుకోవడానికా రూ.65 లక్షలు ఇస్తోంది? కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
Keerthy Suresh :  'ఎల్లమ్మ' నుంచి తప్పుకున్న కీర్తి సురేశ్?  పెళ్లయ్యాక మీరు మారిపోయారు మేడం !
'ఎల్లమ్మ' నుంచి తప్పుకున్న కీర్తి సురేశ్? పెళ్లయ్యాక మీరు మారిపోయారు మేడం !
Telangana LRS Extension: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు- మే 3 లోపు పూర్తి చేసుకునే ఛాన్స్ 
తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు- మే 3 లోపు పూర్తి చేసుకునే ఛాన్స్ 
Retro Twitter Review: 'రెట్రో' ట్విట్టర్ రివ్యూ - సూర్య ఖాతాలో మరో హిట్ పడిందా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
'రెట్రో' ట్విట్టర్ రివ్యూ - సూర్య ఖాతాలో మరో హిట్ పడిందా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Embed widget