అన్వేషించండి

JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష తేదీ వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?

JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2025 పరీక్ష తేదీని ఎన్టీఏ ప్రకటించింది. వచ్చే ఏడాది మే 18న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

JEE Advanced 2025 Exam Schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబరు 3న ప్రకటించింది. వచ్చే ఏడాది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్ పరీక్ష నిర్వహణ బాధ్యత చేపట్టింది.

Website

వీరు అర్హులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు 2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని ఐఐటీ కాన్పూర్ స్పష్టంచేసింది. తాజా నిర్ణయంతో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ పాసైన విద్యార్థులు కూడా ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత లభించినట్లయింది. అయితే సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ఐఐటీ కాన్పుర్ వెల్లడించింది.

సీట్ల సంఖ్య పెరిగే అవకాశం..
జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 17,695 బీటెక్ సీట్లు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వచ్చే విద్యాసంవత్సరం (2025-26)లో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశముంది. 

మూడేళ్ల వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు ఉన్న అవకాశాన్ని కేంద్రం మరో ఏడాది పెంచిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇప్పటివరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉంది. అయితే ఇకపై 3 సంవత్సరాలు పరీక్ష రాసుకోవచ్చని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని జేఈఈ అడ్వాన్స్‌డ్- 2025 నిర్వహణ బాధ్యత చేపట్టిన ఐఐటీ కాన్పుర్ నవంబరు 5న తెలిపింది.  

వీరికి మినహాయింపు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల వరకు మినహాయింపు ఇచ్చారు. ఈ కేటగిరీ కింద 1995 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత పుట్టినవారు కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష తేదీని ఐఐటీ కాన్పుర్ ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా మే మూడు లేదా నాలుగో వారంలో పరీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. దీని ప్రకారం ఈసారి కూడా మే 18 లేదా 25 తేదీల్లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. 

అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి నేరుగా సీట్లు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు ఐఐటీ కాన్పుర్‌లో నేరుగా బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మ్యాథమెటిక్స్, ఇన్‌ఫర్మాటిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)లో 6 సీట్లు కేటాయించనున్నట్లు ఐఐటీ కాన్పుర్‌ పేర్కొంది. కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, బయలాజికల్ సైన్సెస్ & బయో ఇంజినీరింగ్ విభాగాల్లోనూ సీట్లు కేటాయిస్తామని తెలిపింది. ఈ సీట్లకు మార్చి మొదటి వారంలో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది. 'జోసా' కౌన్సెలింగ్ కంటే ముందుగానే ఈ ప్రవేశాలను పూర్తిచేయనున్నారు. అయితే నేరుగా కల్పించే ప్రవేశాల్లో.. ఇప్పటికే ఉన్న సీట్ల నుంచే ఒలింపియాడ్ విద్యార్థులకు కేటాయిస్తారా? లేదా సూపర్ న్యూమరరీ కింద అదనపు సీట్లు మంజూరు చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget