News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Inter Practical Exam: ఇంటర్‌ ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌, ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే!

Inter English Practical Exam : తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరంలోనే ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది.

FOLLOW US: 
Share:

Inter English Practical Exam : తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్య(Inter Education)లో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. మూసపద్ధతిలో ఇంగ్లిష్‌లో పరీక్షలు నిర్వహించడం కాకుండా, ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించి, విద్యాసంవత్సరం చివరిలో ప్రయోగ పరీక్షలను నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు ఇంగ్లిస్ ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ఈ విద్యాసంవత్సరంలోనే ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది.

విద్యార్థులు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌లో భాగంగా మీకు ఇష్టమైన టీచర్‌, ఆట గురించి ఇలా ఏదో ఒక అంశం గురించి ఒక నిమిషం పాటు మాట్లాడాల్సి ఉంటుంది. వారి గురించి మీకు తెలిసిన విషయాలు, ప్రత్యేకతలపై 60 సెకండ్ల పాటు ప్రసంగించాలి. ఇలా చేస్తేనే మార్కులు వేస్తారు. ఇలాంటివి మొత్తం 30 అంశాలు ఇస్తారు. వీటిల్లో ఒకదానిని ఎంచుకొని మాట్లాడాల్సి ఉంటుంది. 

ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌లో మూల్యాంకన పద్ధతుల్లో 'జస్ట్‌ ఏ మినట్‌(జామ్‌)'ఒకటి. ఇందులో భాగంగానే విద్యార్థులు నిమిషం పాటు ప్రసంగించాలి. ఇక రోల్‌ ప్లేలో భాగంగా ఇద్దరు విద్యార్థులు ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు పరస్పరం సంభాషించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక దుకాణాదారుడు.. వినియోగదారుల మధ్య సంభాషణను రోల్‌ ప్లేలో చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేటివ్‌ స్కిల్స్‌లో భాగంగా విద్యార్థి మాటలను ఒకటి లేదా రెండు నిమిషాల పాటు రికార్డుచేస్తారు. దీనికి కూడా మార్కులుంటాయి. 

విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్‌ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు.  అయితే థియరీలో 28 మార్కులు, ప్రాక్టికల్స్‌లో 7 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టు పరిగణనలోకి తీసుకుంటారు. టొఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలకు పునాది వేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారులు తెలిపారు. ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు రాష్ట్రంలోని 2,600 లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

ఆ ఇంటర్నల్‌ పరీక్ష రద్దు..
తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు 'ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌' ఇంటర్నల్‌ పరీక్షను ఇంటర్‌బోర్డు ఇటీవలే రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు బోర్డు తెలిపింది. మరో ఇంటర్నల్‌ అయిన ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నారు. వంద మార్కుల ఈ ఇంటర్నల్‌ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి, అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్‌ పేపర్‌ కాగా, ఈ మార్కులను రెగ్యులర్‌ మార్కుల్లో కలపరు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌ అమలుచేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్‌ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు.. 
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబరు 14తో ముగిసిన సంగతి తెలిసిందే.  అయితే రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 23 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ.1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. చివరిగా రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించు అవకాశం కల్పించారు.

పరీక్ష ఫీజు వివరాలు..

➥ ఇంటర్ ఫస్టియర్ జనరల్ విద్యార్థులు రూ.510

➥ ఇంటర్ ఫస్టియర్  ఒకేషనల్, ప్రాక్టికల్స్‌తో విద్యార్థులు రూ.730.

➥ ఇంటర్ సెకండియర్‌ జనరల్ (ఆర్ట్స్) విద్యార్థులు రూ.510.

➥ ఇంటర్ సెకండియర్‌ జనరల్ (సైన్స్) విద్యార్థులు రూ.730.

➥ ఇంటర్ సెకండియర్‌ ఒకేషనల్ విద్యార్థులు రూ.730.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 20 Nov 2023 01:08 PM (IST) Tags: TS Inter Exams Education News in Telugu TS Intermediate Practical Exams TS Inter English Practical Examsm Inter Exam Fee Dates 2023

ఇవి కూడా చూడండి

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×