అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఐఐటీ మద్రాస్ ఏప్రిల్ 27న సాయంత్రం ప్రారంభించింది. జేఈఈ మెయిన్‌ (JEE Main)లో అర్హత సాధించిన విద్యార్థులు మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

JEE Advanced 2024 Applcation: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఐఐటీ మద్రాస్ (IIT Madras) ఏప్రిల్ 27న సాయంత్రం ప్రారంభించింది. జేఈఈ మెయిన్‌ (JEE Main)లో అర్హత సాధించిన విద్యార్థులు మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రకటించిన షెడ్యూలు ప్రకరం మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్  పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (JEE Advanced 2024 Admit Card) మే 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

మే 26న పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనుండగా.. జూన్ 2న ప్రాథమిక కీ విడుల చేసి, జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 9న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9న ప్రారంభంకానుంది. జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 12న పరీక్ష నిర్వహించి 15న ఫలితాలను వెల్లడించనున్నారు.  

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన రెండున్నరల లక్షల మంది విద్యార్థులకు ఏటా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తున్న  సంగతి తెలిసిందే. కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. 

అర్హతలు: జేఈఈ (మెయిన్)-2024 బీఈ/బీటెక్ పేపర్​లో అన్ని కేటగిరీలు కలిపి మొదటి రెండున్నర లక్షల (2,50,000) మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుకు అర్హులు. 

వయోపరిమితి: అభ్యర్థులు 01.10.1999 తర్వాత జన్మించివారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాల (01.10.1994) వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు​ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు రూ.1600 చెల్లించాలి. ఇతర కేటగిరీలకు చెందినవారందరూ రూ.3200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

పరీక్ష విధానం..

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారువిద్యార్థులు ఈ రెండు పేపర్లు రాయడం తప్పనిసరి. ఒక్కో పేపరులో మూడు సెక్షన్లు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉంటాయి. . ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు. 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు మరో గంట సమయం అదనంగా ఇస్తారు. 

JEE Advanced 2024 ముఖ్యమైన తేదీలివే..

➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.04.2024 (10:00 IST)

➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 07.05.2024 (17:00 IST)

➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.05.2024 (17:00 IST)

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్:  17.05.2024 (10:00 IST) - 26.05.2024 (14:30 IST)

➥ పీడబ్ల్యూడీ అభ్యర్థుల ద్వారా స్క్రైబ్‌ ఎంపిక (40% కంటే తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు రాయడంలో ఇబ్బంది ఉన్నవారు): 25.05.2024.

➥ JEE (Advanced) 2024 పరీక్ష తేది: 26.05.2024 (శనివారం)
   
   ⫸ పేపర్-1: 09:00-12:00 IST
   ⫸ పేపర్-2: 14:30-17:30 IST

➥ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో: 31.05.2024 (17:00 IST) నుండి

➥ JEE (Advanced) 2024 ప్రొవిజినల్ ఆన్సర్ కీ వెల్లడి: 02.06.2024 (10:00 IST)

➥ JEE (Advanced) 2024 ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.06.2024 (10:00 IST) - 03.06.2024 (17:00 IST)

➥  JEE (Advanced) 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ వెల్లడి: 09.06.2024 (10:00 IST)

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09.06.2024 (10:00 IST)

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 10.06.2024 (17:00 IST)

➥ జాయింట్ సీట్ అల్లొకేషన్ (JoSAA) 2024 ప్రక్రియ ప్రారంభం: 10.06.2024 (17:00 IST)

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 పరీక్ష తేది: 12.06.2024 (09:00 IST - 12:00 IST)

➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఫలితాల వెల్లడి: 15.06.2024 (17:00 IST)

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget