IITH PhD Programme: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఎంపికైనవారికి ఫెలోషిప్ ఎంతంటే?
IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ/బీడిజైన్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. అకడమిక మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
IIT Hyderabad PhD Admissions 2024: సంగారెడ్డి జిల్లా కందిలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)' 2024 విద్యాసంవత్సరానికి సంబంధించి 5 సంవత్సరాల పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్ నుంచి బీటెక్/బీఈ/బీడిజైన్/ఎంఎస్సీ కోర్సుల్లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. గేట్ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాలు దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఎంపికచేస్తాయి. ఎంపికైనవారికి ఫెలోషిప్ అందిస్తారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) అభ్యర్థులకు మొదటి 2 సంవత్సరాలు రూ.50,000, ఆ తర్వాత మూడేళ్లపాటు సీనియర్ రిసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్) హోదాలో అభ్యర్థులకు రూ.55,000 ఫెలోషిప్ పొందుతారు.
వివరాలు..
* డైరెక్ట్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (స్పెషల్ రౌండ్)
విభాగాలు..
➥ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
➥ బయోమెడికల్ ఇంజినీరింగ్
➥ బయోటెక్నాలజీ
➥ కెమికల్ ఇంజినీరింగ్
➥ కెమిస్ట్రీ
➥ సివిల్ ఇంజినీరింగ్
➥ క్లైమేట్ చేంజ్
➥ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
➥ డిజైన్
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
➥ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్
➥ మెటీరియల్స్ సైన్స్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్
➥ మ్యాథమెటిక్స్
➥ మెకానికల్ & ఏరోస్పేస్ ఇంజినీరింగ్
➥ ఫిజిక్స్
అర్హత: ఐఐటీ/ఎన్‌ఐటీ/ఐఐఎస్సీ/ఐఐఎస్‌ఈఆర్ నుంచి బీటెక్/బీఈ/బీడిజైన్/ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ అర్హత తప్పనిసరికాదు.
ఫెలోషిప్ వ్యవధి: 5 సంవత్సరాలు.
ఫెలోషిప్ మొత్తం: జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) అభ్యర్థులకు మొదటి 2 సంవత్సరాలు రూ.50,000, ఆ తర్వాత మూడేళ్లపాటు సీనియర్ రిసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్) హోదాలో అభ్యర్థులకు రూ.55,000 ఫెలోషిప్ అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: సంబంధిత విభాగాలు దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఎంపికచేస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 07.07.2024.
చిరునామా:
Academic Section,
Indian Institute of Technology Hyderabad,
Kandi 502284, Sangareddy, Telangana.
ALSO READ:
జులై 4 నుంచి తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 4 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు జులై 4 నుంచి 12 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జులై 6 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఇది పూర్తయిన విద్యార్థులు జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వీరికి జులై 19న మొదటి దశ ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జులై 19 నుంచి 23 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 26 నుంచి ప్రారంభంకానుంది. జులై 27న రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఇది పూర్తయిన విద్యార్థులు జులై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 31న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జులై 31 నుంచి ఆగస్టు 2 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 8 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. విద్యార్థులకు ఆగస్ట్ 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్లు పూర్తిచేసుకున్న వారికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్ ఉండనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..