JEE Advanced 2024 Registration: మే 7తో ముగియనున్న 'జేఈఈ అడ్వాన్స్‌డ్' దరఖాస్తు గడువు, పరీక్ష కేంద్రం వివరాలు ప్రకటించిన ఐఐటీ మద్రాస్
JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 7తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేనివారు వెంటనే చేసుకోవాలి.
![JEE Advanced 2024 Registration: మే 7తో ముగియనున్న 'జేఈఈ అడ్వాన్స్‌డ్' దరఖాస్తు గడువు, పరీక్ష కేంద్రం వివరాలు ప్రకటించిన ఐఐటీ మద్రాస్ IIT madras has released JEE Advanced 2024 Exam city list registration process will conclude on May 7th eligible candidates apply immediately JEE Advanced 2024 Registration: మే 7తో ముగియనున్న 'జేఈఈ అడ్వాన్స్‌డ్' దరఖాస్తు గడువు, పరీక్ష కేంద్రం వివరాలు ప్రకటించిన ఐఐటీ మద్రాస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/06/390bcf02946f4c8c0709bdf18def36e01714972529340522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
JEE Advanced 2024 Registration: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన రెండున్నరల లక్షల మంది విద్యార్థులకు ఏటా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 7తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేనివారు వెంటనే చేసుకోవాలి. మరోవైపు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన జాబితాను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. దేశంలో 228 నగరాలు/పట్టణాలు పాటు విదేశాల్లో 3 చోట్ల (యూఏఈలో అబుదాబి, దుబాయ్; నేపాల్) పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీలో 26 కేంద్రాలు, తెలంగాణలో 13 కేంద్రాలు ఉన్నాయి.
JEE(Adv) 2024 Examination Cities
ప్రకటించిన షెడ్యూలు ప్రకరం మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష . జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (JEE Advanced 2024 Admit Card) మే 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.నిర్వహించనున్నారు. మే 26న పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనుండగా.. జూన్ 2న ప్రాథమిక కీ విడుల చేసి, జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 9న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9న ప్రారంభంకానుంది. జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 12న పరీక్ష నిర్వహించి 15న ఫలితాలను వెల్లడించనున్నారు.
పరీక్ష విధానం..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారువిద్యార్థులు ఈ రెండు పేపర్లు రాయడం తప్పనిసరి. ఒక్కో పేపరులో మూడు సెక్షన్లు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉంటాయి. . ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు. 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు మరో గంట సమయం అదనంగా ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కావలి, కర్నూలు, మార్కాపురం, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, సూర్యపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, మైలవరం, మచిలీపట్నం.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్.
JEE Advanced 2024 ముఖ్యమైన తేదీలివే..
➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.04.2024 (10:00 IST)
➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 07.05.2024 (17:00 IST)
➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.05.2024 (17:00 IST)
➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 17.05.2024 (10:00 IST) - 26.05.2024 (14:30 IST)
➥ పీడబ్ల్యూడీ అభ్యర్థుల ద్వారా స్క్రైబ్ ఎంపిక (40% కంటే తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు రాయడంలో ఇబ్బంది ఉన్నవారు): 25.05.2024.
➥ JEE (Advanced) 2024 పరీక్ష తేది: 26.05.2024 (శనివారం)
⫸ పేపర్-1: 09:00-12:00 IST
⫸ పేపర్-2: 14:30-17:30 IST
➥ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో: 31.05.2024 (17:00 IST) నుండి
➥ JEE (Advanced) 2024 ప్రొవిజినల్ ఆన్సర్ కీ వెల్లడి: 02.06.2024 (10:00 IST)
➥ JEE (Advanced) 2024 ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.06.2024 (10:00 IST) - 03.06.2024 (17:00 IST)
➥ JEE (Advanced) 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ వెల్లడి: 09.06.2024 (10:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09.06.2024 (10:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 10.06.2024 (17:00 IST)
➥ జాయింట్ సీట్ అల్లొకేషన్ (JoSAA) 2024 ప్రక్రియ ప్రారంభం: 10.06.2024 (17:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 పరీక్ష తేది: 12.06.2024 (09:00 IST - 12:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఫలితాల వెల్లడి: 15.06.2024 (17:00 IST)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)