News
News
X

Caste Awareness Course: ఆ ఐఐటీలో ఇకపై క్యాస్ట్ అవేర్‌నెస్‌ కోర్స్ తప్పనిసరి! ఎప్పటి నుంచంటే?

బాంబే ఐఐటీలో క్యాస్ట్ అవేర్‌నెస్ కోర్స్‌ని తప్పనిసరి చేయనున్నారు. ఈ నిబంధనను త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు.

FOLLOW US: 

అవగాహన పెంచేందుకే ఈ కోర్స్..

ఐఐటీ బాంబే త్వరలోనే క్యాస్ట్ అవేర్‌నెస్ కోర్స్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లోని ఎస్‌సీ, ఎస్‌టీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సమాన అవకాశాలు, వసతులు అందించేందుకు ఈ క్యాస్ట్‌ అవేర్‌నెస్ కోర్స్‌ ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయపడింది. కులం ఆధారంగా కొందరు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, ఇది గమనించే సర్వే చేపట్టామని ఎస్‌సీ, ఎస్‌టీ విభాగం స్పష్టం చేసింది. ఈ సర్వేలోని కొన్ని నిజాలు వెల్లడయ్యాకే, కులంపై అవగాహన పెంపొందించేందుకు ఏదైనా చేయాలని ఆలోచించామని పేర్కొంది. ఆ తరవాతే క్యాస్ట్ అవేర్‌నెస్‌ కోర్స్‌ని రూపొందిచాలని భావించామని చెప్పింది. లింగ వివక్షను తగ్గించే విధంగా విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గతేడాది జెండర్ సెన్సిటిసేషన్ కోర్స్‌ను ప్రవేశపెట్టింది బాంబే ఐఐటీ. ఇప్పుడు కుల వివక్షను కట్టడి చేసే కోర్స్‌పై దృష్టి సారించింది. 

మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌ కూడా ఏర్పాటు చేస్తారా..? 

అయితే ఈ కోర్స్‌ ఎలా ఉంటుంది..? ఏయే సబ్జెక్ట్‌లుంటాయి అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. "క్యాస్ట్‌కి సంబంధించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులను తగ్గించేందుకు, వారిలో ఏ వర్గ విభేదాలు లేకుండా చూసేందుకు ఎంతో ఆలోచించి ఈ కోర్స్‌ ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం" అని ఎస్‌సీ, ఎస్‌టీ సెల్ స్పష్టం చేసింది. దాదాపు 100 మంది విద్యార్థులతో  ఓపెన్‌ డిబేట్‌ పెట్టింది ఈ సెల్. కులం ఆధారంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో విద్యార్థులు వివరించాలని కోరింది. ఈ మీట్‌లో విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రిజర్వేషన్‌ ద్వారా సీట్ సంపాదించిన వారిపై, మెరిట్ విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కొందరు చెప్పారు. ప్రత్యేక కోర్స్‌తో పాటు మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌నీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా సీనియర్ స్టూడెంట్స్‌, జూనియర్ ఎస్‌సీ, ఎస్‌టీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే వెసులుబాటు ఉంటుంది.

Also Read: Eat Mobility : ఈ - మెబిలిటీ అంటే ఈట్ మొబిలిటి ! ఆనంద్ మహింద్రా కొత్త ఇన్వెంటరీ

Also Read: Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Published at : 04 Jul 2022 05:28 PM (IST) Tags: caste IIT Bombay Caste Awareness Course Bombay IIT

సంబంధిత కథనాలు

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

NEET 2022 Result: ఆగస్టు 17న నీట్‌ ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?

NEET 2022 Result: ఆగస్టు 17న నీట్‌ ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు ఎప్పుడంటే?

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!

NTR Health University:  పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!

CUET UG Exam: విద్యార్థులకు అలర్ట్ - ఆ 11 వేల మందికి ఆగస్టు 30న పరీక్ష!

CUET UG Exam: విద్యార్థులకు అలర్ట్ - ఆ 11 వేల మందికి ఆగస్టు 30న  పరీక్ష!

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు