అన్వేషించండి

ICSE and ISC Result 2026: ఐసీఎస్‌ఈ, ఐఎస్సీ ఫలితాలు 2026 గురువారం విడుదల! మీ స్కోర్ కార్డుని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ICSE and ISC Result 2026:ఐసీఎస్‌, ఐఎస్సీ ఫలితాలను ఏప్రిల్‌ 30 గురువారం నాడు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌, ఎస్సెమ్మెస్‌, డిజీలాకర్, ఉమంగ్ యాప్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.   

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICSE, ISC 2026 పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి.
  • విద్యార్థులు cisce.org, results.cisce.org లలో ఫలితాలు చూడవచ్చు.
  • వెబ్‌సైట్‌ కాకుండా SMS, డిజిలాకర్, ఉమంగ్ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
  • యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, క్యాప్చా కోడ్‌తో స్కోర్‌కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ICSE and ISC Result 2026:భారత్‌లోని లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ICSE -పదో తరగతి), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్‌ (ISC 12వ తరగతి) పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30 గురువారం నాడు విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ప్రకటన విద్యార్థుల భవిష్యత్‌కు మైలురాయి కానుంది. 

ఎప్పుడు, ఎక్కడ ఫలితాలు అందుబాటులో ఉంటాయి?

ఐసీఎస్‌ఈ, ఐఎస్సీ 2026 పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ మార్కులను కౌన్సిల్‌ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు కింది వెబ్‌సైట్‌లను సందర్శించాల్సి ఉంటుంది. cisce.org, results.cisce.org, గురువారం ఫలితాలు విడుదల కాగానే వెబ్‌సైట్‌లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున,ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. 

Also Read: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?

ఫలితాలు ఎలా చూసుకోవాలి?

వెబ్‌సైట్ ద్వారా మీ స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోడానికి ఈ దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ results.cisce.org ఓపెన్ చేయండి. హోమ్‌‌ పేజ్‌లో కనిపించే 'ICSE Scorecard 2026" లేదా "ISC Scorecard 2026" లింక్‌పై క్లిక్ చేయండి. మీ లాగిన్ వివరాలై యూనిక్ ఐడీ, ఇండెక్స్‌ నెంబర్‌, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. వివరాలను సమర్పించిన తర్వాత మీ స్కోర్‌ కార్డ్ పీడీఎఫ్‌ రూపంలో స్క్రీన్ కనిపిస్తుంది. భవిష్యత్‌ అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని, ఒక ప్రింటవుట్‌ తీసుకోవడం మరచిపోవద్దు. 

ఇంటర్నెట్‌ లేకపోయిన ఫలితాలు తెలుసుకోవచ్చు

ఒక వేళ మీరు ఇంటర్నెట్‌ సదుపాయం లేని ప్రాంతంలో ఉన్నా లేదా వెబ్‌సైట్‌్ మొరాయించినా, సాధారణ మొబైల్‌ మెసేజ్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. మీ మొబైల్ మెసేజ్ బాక్స్‌లో ICSE మీ ఏడు అంకెల యూనిక్ ఐడీ టైప్ చేయండి. దీనిని 09248082883 నంబర్‌కు పంపండి. వెంటనే మీ ఫలితాలు మీ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. 

Also Read: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు

డిజిలాకర్‌లో ఫలితాలు 

డిజిలాకర్ వెబ్‌సైట్‌ లేదా యూప్‌ను ఓపెన్ చేయండి. మీ అకౌంట్‌లోకి సైన్ ఇవ్వండి. ఖాతా లేకపోతే కొత్తగా క్రియేట్ చేయాలి. హోమ్‌పేజీలో ఐసీఎస్‌ఈ పదో తరగతి లేదా ఐఎస్సీ 12వ తరగతి మార్కు షీట్ లింక్‌ కోసం వెతకండి. అవసరమైన వివరాలను నమోదు చేసి సబ్‌మిట్‌ చేస్తే మీ డిజిటల్‌ మార్కు షీట్‌ డౌన్‌లోడ్ అవుతుంది. 

ఉమంగ్ యాప్‌లో ఫలితాలు       

మీ మొబైల్‌లో ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి మీ రోల్ నెంబర్, స్కూల్‌ నంబర్, అడ్మిట్‌ కార్డ్ ఐడీ వివరాలను నమోదు చేయండి. మీ మార్కు షీట్‌ పీడీఎఫ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని సేవ్ చేసుకోండి. 

Also Read: రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

Frequently Asked Questions

2026 విద్యా సంవత్సరానికి ICSE మరియు ISC పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి?

2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ICSE (పదో తరగతి) మరియు ISC (12వ తరగతి) పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30, గురువారం నాడు విడుదల కానున్నాయి.

ICSE మరియు ISC పరీక్షల ఫలితాలను ఎక్కడ చూడవచ్చు?

విద్యార్థులు తమ మార్కులను కౌన్సిల్ అధికారిక వెబ్ సైట్లు cisce.org మరియు results.cisce.org లలో చూడవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే ఈ వెబ్ సైట్లను సందర్శించాల్సి ఉంటుంది.

వెబ్ సైట్ ద్వారా ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

results.cisce.org వెబ్ సైట్ ఓపెన్ చేసి, 'ICSE Scorecard 2026' లేదా 'ISC Scorecard 2026' లింక్ పై క్లిక్ చేయాలి. మీ యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే స్కోర్ కార్డ్ PDF రూపంలో కనిపిస్తుంది.

ఇంటర్నెట్ లేకపోయినా ఫలితాలు తెలుసుకోవచ్చా?

అవును, ఇంటర్నెట్ లేకపోయినా లేదా వెబ్ సైట్ మొరాయించినా, సాధారణ మొబైల్ మెసేజ్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. ICSE మీ ఏడు అంకెల యూనిక్ ఐడీని 09248082883 నంబర్ కు SMS పంపితే ఫలితాలు తెలుస్తాయి.

డిజిలాకర్ మరియు ఉమంగ్ యాప్ ద్వారా ఫలితాలు పొందవచ్చా?

అవును, డిజిలాకర్ వెబ్ సైట్/యాప్ లేదా ఉమంగ్ యాప్ లో రిజిస్టర్ అయ్యి, అవసరమైన వివరాలు నమోదు చేయడం ద్వారా మీ డిజిటల్ మార్కు షీట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget