అన్వేషించండి

CA May 2024 Exams: ఐసీఏఐ సీఏ పరీక్షలు వాయిదా, కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?

ICAI CA May 2024 exams: మే నెలలో నిర్వహించనున్న ఐసీఏఐ సీఏ పరీక్షల షెడ్యూలులో మార్పులు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల తేదీల్లోనే సీఏ పరీక్షలు ఉండటంతో పరీక్షలను ఐసీఏఐ వాయిదావేసింది.

ICAI CA Exams: మే నెలలో నిర్వహించనున్న ఐసీఏఐ సీఏ పరీక్షల షెడ్యూలులో మార్పులు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల తేదీల్లోనే సీఏ పరీక్షలు ఉండటంతో పరీక్షలను 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' వాయిదావేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి జూన్ 26 వరకు సీఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను మార్చాలని ICAI నిర్ణయించింది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల కొత్త షెడ్యూలును మార్చి 19న వెల్లడించనున్నారు.

CA May 2024 Exams: ఐసీఏఐ సీఏ పరీక్షలు వాయిదా, కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?ఎన్నికల సమయంలో ఇతర పరీక్షల వివరాలు ఇలా..

ఎన్నికల తేదీల్లోనే జాతీయస్ధాయి పోటీపరీక్షలతోపాటు, ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మే నెలలో పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఆయా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వల్ల  పరీక్ష సెంటర్ల కేటాయింపులు, ప్రజా రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. దూరంగా సెంటర్ పడితే, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే కష్టమవుతుందని భయపడుతున్నారు. మరోవైపు కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం లేకుండా పోతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూలుకు అనుకూలంగా గతంలో పలు పరీక్షల తేదీల్లో మార్పులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మేరకు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల తేదీల్లోనూ మార్పులు జరుగవచ్చని భావిస్తున్నారు.  

ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉన్నాయంటే?

➥ ప్రధానంగా తెలంగాణలో మే 9 నుంచి 12 వరకు TS EAPCET, ఏపీలో మే 13 నుంచి 19 వరకు AP EAPCET పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్దులు హాజరుకానున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్‌ జరుగనుంది. అంటే మే 12న పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకొంటారు. ఈ నేపథ్యంలో ఎప్‌సెట్‌ పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందా? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. ఇంజినీరింగ్‌ పరీక్షలను సజావుగా నిర్వహించవచ్చని, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందన్న భావన అధికారుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌, ఫార్మసీవిభాగం పరీక్షను వాయిదా వేయడ మా.. ? లేదా మొత్తానికి మొత్తం పరీక్షలను వాయిదా వేయాలా..? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ఐసెట్‌ పరీక్షలను జూన్‌ 4, 5న నిర్వహిస్తామని కాకతీయ యూనివర్సిటీ అధికారులు గతంలో ప్రకటించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లలెక్కింపు కూడా జూన్‌ 4న జరుగనున్నది. అంటే, ఈ లెక్కన ఐసెట్‌ వాయిదావేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 

➥ తెలంగాణలోని  ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం మే 13 నుంచి 21 వరకు నిర్వహించే డిపార్టుమెంటల్‌ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.

➥ మరోవైపు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఎన్నికల సమయంలోనే డిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామకాలకు  మే 9, 10, 13 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది అభ్యర్థులు హాజరవుతుంటారు.

➥ ఇక మే 2 నుంచి 13 వరకు ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు రాస్తుంటారు.

➥ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను మే 26న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.

➥ కేంద్రీయ విద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన సీయూఈటీ యూజీ పరీక్షలు మే 15 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.

➥ ఇక జేఈఈ 2024 మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget