By: ABP Desam | Updated at : 01 Jul 2021 08:19 PM (IST)
law
తెలంగాణలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ కోసం ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.250తో జూలై 15వ తేదీ వరకు, రూ.500తో జూలై 24 వరకు, రూ.1000తో ఆగస్టు 2 వరకు, రూ.2000తో ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునేందుకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమనరీ 'కీ'ని ఆగస్టు 26న విడుదల చేయనుంది. 'కీ' మీద అభ్యంతరాలను ఆగస్టు 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనుంది. కాగా, రాష్ట్రంలో మొత్తం 21 లా కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాసెట్ ద్వారా మూడు, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులు, పీజీఎల్ సెట్ ద్వారా ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. 2021 - 2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది మార్చి 24నే విడుదల అయినప్పటికీ, కరోనా కారణంగా దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటోంది.
ముఖ్యమైన వివరాలు:
టీఎస్ లాసెట్ (టీఎస్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) - 2021 (ఎల్‌ఎల్‌బీ - 3/5 ఏళ్లు)
టీఎస్ పీజీఎల్ సెట్ (టీఎస్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) - 2021 (ఎల్ఎల్ఎం - 2 ఏళ్లు)
అర్హతలు:
ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు.. ఇంటర్మీడియట్ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులు సాధించాలి.
మూడేళ్ల లా కోర్సులకు.. 45 శాతం మార్కులతో డీగ్రీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://lawcet.tsche.ac.in/
ఫీజు వివరాలు:
టీఎస్ లాసెట్ దరఖాస్తులకు.. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.
టీఎస్ పీజీఎల్ సెట్ దరఖాస్తులకు.. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.800, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: జూలై 5, 2021 (ఆలస్య రుసుము లేకుండా)
టీఎస్ లాసెట్ - 2021 పరీక్ష తేదీ: ఆగస్టు 23, 2021
టీఎస్ పీజీఎల్ సెట్ - 2021 పరీక్ష తేదీ: ఆగస్టు 23, 2021
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్ రూల్స్
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్