విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!
వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి.
విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో పీజీలో చేరడానికి లేదా ప్రాక్టీసు చేయడానికి.. వారు ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ)'లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. ఆ ధ్రువపత్రం లేకుండా ఎఫ్‌ఎంజీఈకి చేసుకునే దరఖాస్తులను తిరస్కరిచనున్నట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది.
ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ధ్రువపత్రం పొందాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చి 8న సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తిస్థాయి వివరాలు నమోదు చేయని అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
Also Read:
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!
తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. అయితే జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, అలాగే.. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌కు అర్హులు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏప్రిల్ 12 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, వేసవి సెలవులు ఎప్పుటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాలల్లో 1-9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 3 - 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతుండటంతో మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది. తాజా షెడ్యూలు ప్రకారం 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి. ఇక 6 నుంచి 9 తరగతుల వారికి ఏప్రిల్ 20 వరకు జరగనున్నాయి. పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 24న తల్లిదండ్రులతో పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని, క్యుమిలేటివ్ రికార్డులపై తల్లిదండ్రుల సంతకాలు తీసుకోవాలని ప్రిన్సిపల్స్‌కు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సూచించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..