By: ABP Desam | Updated at : 16 Aug 2023 11:34 AM (IST)
Edited By: omeprakash
డిగ్రీ ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యం
తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు డిగ్రీ ఫలితాల రూపంలో కష్టకాలం నెలకొంది. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో కొన్ని విశ్వవిద్యాలయాల నిర్లక్ష్యం వల్ల విద్యాసంవత్సరం (2023-24) చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యేలా పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నా.. డిగ్రీ ఫలితాలు వెల్లడికాకపోవడంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహించలేకపోతున్నారు. ఇప్పటికైతే ఎంసెట్, ఈసెట్ కౌన్సెలింగ్‌లు మాత్రమే కొనసాగుతున్నాయి.
ఆయా ప్రవేశాలను సంబంధించి ఒక్కొక్కటిగా కౌన్సెలింగ్ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అక్టోబరు, నవంబరు వరకు ఆయా కౌన్సెలింగ్‌లు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ సీట్ల భర్తీకి పీజీఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించినా వెబ్ ఆప్షన్లు మాత్రం మొదలుకాలేదు. దీనికి కారణం కాకతీయ వర్సిటీ పరిధిలో బీఫార్మసీ ఫలితాలు వెల్లడికాకపోవడమే. ఆ వర్సిటీ ఇప్పటివరకు ఎంఫార్మసీ కళాశాలల జాబితాను కూడా ఉన్నత విద్యామండలికి పంపలేదు. ఇటీవల షెడ్యూలును సవరించి ఆగస్టు 28 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించడం విద్యార్థులకు ఊరట కలిగించే విషయం.
మరోవైపు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 14 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. సెప్టెంబరు 6కు వాయిదా వేశారు. ఇందుకు కారణం ఓయూ, కాకతీయ పరిధిలో డిగ్రీ ఫలితాల వెల్లడిలో ఆలస్యమే. ఏటా న్యాయవిద్య కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) అనుమతులు ఆలస్యమవుతున్నాయని చెప్పే అధికారులు.. ఈసారి కళాశాలల జాబితానే ఆ సంస్థకు ఇప్పటివరకు పంపకపోవడం గమనార్హం. ఉన్నత విద్యామండలి అధికారులు చొరవ తీసుకొని త్వరగా కౌన్సెలింగ్‌లను ప్రారంభించాలని అభ్యర్థులు కోరుతున్నారు. కొందరు ఉద్యోగాలకు ఎంపికైనా.. ఫలితాలు రాకపోవడంతో ధ్రువపత్రాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
ఈ విద్యాసంవత్సరం తరగతులు సకాలంలోనే ప్రారంభమవుతాయని అంతా భావించారు. అయితే డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల చివరి సంవత్సరం, రెండో సెమిస్టర్ పరీక్షలు ఆలస్యంగా జరగడంతో వాటి ఫలితాలు కొంత ఆలస్యం కావొచ్చని భావించిన ఉన్నత విద్యామండలి ఆయా ప్రవేశ పరీక్షల ఫలితాల వెల్లడిలోనూ ఉదాసీనంగా వ్యవహరించింది. ఓయూలో బీకాం, బీఏ చివరి సంవత్సరం ఫలితాలు ఇచ్చినా.. బీఎస్సీ, బీఏ కోర్సుల ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో డిగ్రీతో ముడిపడిన ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ కౌన్సెలింగ్ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో అర్ధంతరంగా పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది. మధ్యలో సీపీగెట్ పరీక్షలు కూడా అడ్డంకిగా మారాయి. మళ్లీ పోటీ పరీక్షల తేదీలను పరిశీలించి నిర్వహించాం. మూల్యాంకనాన్ని వేగంగా చేస్తున్నాం. ఈ నెలాఖరులోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ALSO READ:
పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదేశాలు జారీ, 18లోపు పూర్తికావాలి
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆగస్టు 14న ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ప్రైమరీ, మండల పరిషత్ ప్రైమరీ, మున్సిపల్ పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులు, అవసరమైన ఉపాధ్యాయుల జాబితాను జులై 31వ తేదీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆధారంగా జిల్లా విద్యాశాఖకు అందించాలని తెలిపారు. 84, 85, 117, 128, 47, 60 జిఓల ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలని సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
TS ICET: టీఎస్ ఐసెట్-2023 రిపోర్టింగ్ గడువు పెంపు, ఎప్పటివరకంటే?
రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>