CUET PG 2022 : సీయూఈటీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు
CUET PG 2022 : దేశంలోని 42 సెంట్రల్ యూనివర్సిటీల ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీయూఈటీ-2022 దరఖాస్తు గడువును ఎన్టీఏ పొడిగించింది.
CUET PG 2022 : కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-PG 2022 రిజిస్ట్రేషన్ గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. దేశంలోని 42 సెంట్రల్ యూనివర్సిటీలలో (CUET PG 2022) పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ అర్హత పరీక్షకు దరఖాస్తు గడువును ఎన్టీఏ జులై 4 వరకు పొడిగించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (PG)- 2022 ఆన్‌లైన్ దరఖాస్తుకు మే 19న నోటిఫికేషన్ విడుదల అయింది. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి జూన్ 18 లాస్ట్ డేట్ గా ప్రకటించింది. తాజాగా దరఖాస్తు గడువును జూన్ 18, 2022 నుంచి జూలై 4 పొడిగించింది.
42 యూనివర్సిటీలకు కామన్ ఎగ్జామ్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (PG) CUET-PG 2022 గడువును జూన్ 18 నుంచి జులై 4, 2022 వరకు పొడిగించింది. పరీక్షలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేయడానికి ముందు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదవాలి. 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని యూనివర్సిటీలకు కామన్ ఎంట్రన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. పొడిగించిన గడువు ప్రకాం జులై 4 సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు.
CUET PG-2022 కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి
1) అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inకి వెళ్లండి
2) హోమ్ స్క్రీన్‌పై CUET (PG) 2022 కోసం రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
3) పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలతో సహా వివరాలను నింపండి.
4) మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేసినప్పుడు, మీకు "అప్లికేషన్ నంబర్" కేటాయిస్తారు.
5) సిస్టమ్ రూపొందించిన రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ నంబర్‌ని ఉపయోగించి CUET PG 2022 దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిచేయండి.
6) ఫొటో, సంతకాలతో సహా స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి
7) దరఖాస్తు రుసుము చెల్లించండి
8) CUET PG దరఖాస్తును సమర్పించండి
9) ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ప్రింటవుట్ తీసుకోండి
NTA ప్రకారం సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తు ఎడిట్ ఉండదు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా అప్లికేషన్ పూర్తి చేయాలి. ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు NTA హెల్ప్ డెస్క్‌ని 011 4075 9000లో సంప్రదించవచ్చు లేదా cuet-pg@nta.ac.inలో NTAకి మెయిల్ చేయవచ్చు.