CIPET: సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది.
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) 2023 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కోర్సు అనుసరించి పదవతరగతి, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
🔰 సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023
కోర్సులు: డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా.
కోర్సుల వివరాలు..
1. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ)
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.
2. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ)
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.
3. పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ కాడ్/కామ్(పీడీ-పీఎండీ విత్ కాడ్/కామ్)
అర్హత: 3 సంవత్సరాల డిప్లొమా(మెకానికల్/ప్లాస్టిక్స్/పాలిమర్/టూల్/ప్రొడక్షన్/మెకాట్రోనిక్స్/ఆటోమొబైల్/టూల్&డై మేకింగ్/పెట్రోకెమికల్స్/ఇండస్ట్రియల్/ఇన్‌స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ లేదా డీపీఎంటీ/డీపీటీ(సీపెట్)) లేదా తత్సమాన ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: 1.5 సంవత్సరాలు.
4. పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్(పీజీడీ-పీపీటీ)
అర్హత: 3 సంవత్సరాల డిగ్రీ(సైన్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
✯ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.02.2023.
✯ దరఖాస్తు చివరి తేది: 28.05.2023.
✯ సీపెట్ పరీక్ష తేది: 11.06.2023.
Also Read:
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..