అన్వేషించండి

SSC Results 2026: పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!

SSC Results 2026: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. చాలా మంది అనుకున్నట్టు చదవలేక ఫెయిల్ అయ్యారు. అలాంటిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోయినా, నైపుణ్య శిక్షణతో ఉద్యోగాలు పొందవచ్చు.
  • ప్రభుత్వం యువత కోసం అప్రెంటిస్‌షిప్, ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోంది.
  • సేల్స్, మార్కెటింగ్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి రంగాల్లో అవకాశాలున్నాయి.
  • ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి ప్రోత్సహించబడుతుంది.

SSC Results 2026: ప్రతి వ్యక్తికి తన లక్ష్యాలవైపు దూసుకెళ్లడానికి పదో తరగతి టర్నింగ్ పాయింట్. అలాంటి పాయింట్ వద్ద గతి తప్పితే జీవితమే ముగిసిపోయిందని బాధపడాల్సిన పని లేదు. అలాంటి వారిని పిలిచి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలు ఉన్నాయి. అందరూ ఉన్నత చదువులు చదివే ఎదగాలనే లేదు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. 

భారత్ జనాభాలో 15-29 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత 27. 2 శాతం మంది ఉన్నారు. ఇది 2036 నాటికి సుమారు 345 మిలియన్లకు చేరుకుంటుంది. ఈ భారీ యువశక్తిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా లెర్న్ వైల్ యు ఎర్‌ అనే నినాదంతో అప్రెంటిస్‌షిప్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దటమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నారు.  

పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం కెరీర్‌కు ముగింపు కాదు. నైపుణ్యం ఉంటే అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవచ్చు. చిన్న దుకాణాల్లో సేల్స్, మార్కెటింగ్ టీమ్‌లలో చేరవచ్చు. ఇవి చాలా ఉన్నతమైన కెరీర్ ఉన్న ఉద్యోగాలు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు చాలానే ఉన్నాయి. కొందరు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తే మరికొందరు తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తున్నాయి. వాళ్లే కెరీర్ ఆపర్చ్యూనిటీస్‌ కూడా  కల్పిస్తున్నారు. హెయిర్ స్లైలిస్ట్, మేకప్‌ ఆర్టిస్ట్‌, స్పా థెరపిస్ట్ కోర్సులకు భారీ డిమాండ్ ఉంది. వాటిలో కూడా చేరవచ్చు. NSDC భాగస్వామ్యంతో అనేక సంస్థలు మూడు నెలల సర్టిఫికెట్ కోర్స్‌లు అందిస్తున్నాయి. డెలివరీ పర్శన్, ప్యాకేజింగ్ స్టాఫ్, వేర్ హౌస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు లాజిస్టిక్‌ రంగంలో ఎప్పుడూ అవకాశాలు ఉండనే ఉన్నాయి. 

అండగా కేంద్ర ప్రభుత్వం  

చదువులో రాణించలేరని వారికోసం కేంద్రం ప్రత్యేక పథకాలు చేపట్టింది. వారికి నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పేరుతో 40కిపైగా రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తోంది. సర్టిఫికెట్ కూడా ఇస్తోంది. స్వయం ఉపాధి, వ్యాపారంలో రాణించాలనుకునే వారికి ప్రత్యేకంగా ముద్ర లోన్స్ ఇస్తోంది. ఇందులో మీరు యాభై వేల నుంచి పది లక్షల వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా లోన్ పొందవచ్చు. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ శ్రమ్‌ పోర్టల్ ఏర్పాటు చేసింది. ఇందులో రిజిస్టర్ చేసుకుంటే ప్రమాద బీమా, ఇతర సామాజిక భద్రత పథకాలు లభిస్తాయి. 

కేవలం అకడమిక్ విద్యతోనే ఉద్యోగాలు వస్తాయనేది తప్పుడు అభిప్రాయం, ప్రాక్టికల్‌ నైపుణ్యం చాలా ముఖ్యం. 

Frequently Asked Questions

పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం ముగిసిపోయినట్టేనా?

అస్సలు లేదు. పదో తరగతిలో ఫెయిల్ అయినప్పటికీ, నైపుణ్య శిక్షణతో మంచి కెరీర్ నిర్మించుకోవచ్చు. అనేక సంస్థలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

యువతలో నైపుణ్యాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?

కేంద్ర ప్రభుత్వం 'లెర్న్ వైల్ యు ఎర్న్' నినాదంతో అప్రెంటిస్‌షిప్‌ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా యువతకు శిక్షణ ఇవ్వడమే దీని లక్ష్యం.

నైపుణ్య శిక్షణ ద్వారా ఏయే రంగాల్లో అవకాశాలు ఉన్నాయి?

సేల్స్, మార్కెటింగ్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, డెలివరీ పర్సన్, ప్యాకేజింగ్ స్టాఫ్ వంటి రంగాల్లో అవకాశాలు ఉన్నాయి.

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

ఈ పథకం కింద 40కి పైగా రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ అందించి, సర్టిఫికెట్ ఇస్తారు. స్వయం ఉపాధి, వ్యాపారం కోసం ముద్ర లోన్స్ కూడా అందిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget