School Holidays: ఆ స్కూళ్లకు ఇవాళ్టి నుంచి సెలవులు, తిరిగి తెరచుకునేది అప్పుడే!
TS: క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణలోని మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26 వరకు సెలవులు ఇచ్చారు. మొత్తం 5 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
Christmas Holidays For Schools: క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణలోని మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26 వరకు సెలవులు ఇచ్చారు. మొత్తం 5 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. కొన్ని పాఠశాలలకు డిసెంబర్ 25, 26 తేదీల్లో సెలవులు ఇచ్చారు. మరికొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25న మాత్రమే సెలవు ప్రకటించారు. కాగా, డిసెంబర్ 26వ తేదీని రాష్ట్ర సర్కార్ సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. ఏపీలోని స్కూళ్లకు డిసెంబరు 25, 26 తేదీల్లో సెలవు ఉండనుంది. కొన్ని చోట్ల డిసెంబరు 23న కూడా సెలవు ప్రకటించారు.
సంక్రాంతి సెలువులు ఎన్నిరోజులంటే..?
తెలంగాణలో దసరా పండగ తర్వాత ఎక్కువ రోజులు స్కూల్స్, కాలేజీలకు సెలవులు వచ్చేది సంక్రాంతి పండగకే. అలాగే ఏడాది ప్రారంభ నెల అయిన జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే. ఈ సారి తెలంగాణలో సంక్రాంతి సెలవులు నాలుగు నుంచి ఆరు రోజులు పాటు రానున్నాయి. జనవరి 13వ తేదీన రెండో శనివారం చాలా స్కూల్స్, కాలేజీలకు సెలవు ఉంటుంది. అలాగే జనవరి 14వ తేదీన భోగి పండగ.. ఆదివారం వచ్చింది. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండగ.. సాధారణంగా సెలవులు ఉంటుంది. అలాగే జనవరి 16వ తేదీన ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్, కాలేజీలకు మరో రెండు రోజులు పాటు అదనం సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో స్కూల్స్, కాలేజీలకు దాదాపు 6 రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
న్యూ ఇయర్ వరుసగా రెండు రోజులు సెలవులు..
ప్రతి ఏడాది సాధారణంగా జనవరి నెలలో స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు భారీగా సెలవులు వస్తున్న విషయం తెల్సిందే. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభం కానుంది. 2024 న్యూ ఇయర్ సోమవారం వచ్చింది. దీంతో న్యూ ఇయర్‌కి వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఎలా అంటే.. డిసెంబర్ 31 ఆదివారం.. జనవరి 1వ తేదీ సోమవారం.. ఈ ప్రకారంగా వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం జనవరి 1వ తేదీ ఇచ్చిన సెలవును.. ఫిబ్రవరి 10వ తేదీ రెండో శనివారం పనిదినంగా ప్రకటించింది.
రిపబ్లిక్ డే సైతం..
ఇదే నెల జనవరి 26 తేదీన రిపబ్లిక్ డే సైతం ఉన్న విషయం మీ అందరికి తెల్సిందే. రిపబ్లిక్ డే శుక్రవారం వచ్చింది.. స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు ఈ సెలవును ప్రభుత్వం అధికారికం ప్రకటించింది. ఈ ప్రకారంగా చూస్తే.. వచ్చే ఏడాది జనవరి నెలలో సెలవులకు కొదువ ఉండదనే చెప్పాలి. ఇంకా ఇలా ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఈ నెలలో రానున్నాయి. మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి.
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే..?
జనవరి 13వ తేదీన రెండో శనివారం చాలా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది. అలాగే జనవరి 14వ తేదీన భోగి పండగ.. ఆదివారం వచ్చింది. జనవరి 15వ తేదీన సోమవారం సంక్రాంతి పండగ.. సాధారణంగా సెలవు ఉంటుంది. అలాగే జనవరి 16వ తేదీన ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజులు పాటు అదనంగా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో స్కూళ్లు, కాలేజీలకు దాదాపు 6 రోజులు పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది.