అన్వేషించండి

AP Medical Colleges: ఏపీలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! కొత్త కాలేజీలు ఎక్కడంటే?

రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా సీఎస్ఎస్ కింద మూడో దశల్లో ఏపీలో 3 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత (సీఎస్‌ఎస్‌) కింద ఆంధ్రప్రదేశ్‌లోని  పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి భారతీ పవార్ తెలిపారు. ఈ మూడు కాలేజీల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు తెలిపారు. అలాగే  రెండవ దశలో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తూ కొత్త పీజీ కోర్సులు ప్రారంభించేందుకు 1040 పీజీ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. 

రాజ్యసభలో మంగళవారం (డిసెంబరు 13) ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా సీఎస్ఎస్ కింద మూడో దశల్లో దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. జాతీయ మెడికల్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం ఏపీలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలతో సహా 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, ఇప్పటికే సీఎస్ఎస్ కింద మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల లిస్టులో లేని కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్టు మంత్రి తెలిపారు. రూరల్ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో జిల్లా ఆసుపత్రులు, రిఫరల్ ఆసుపత్రులకు అనుసంధానంగా వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలిపారు.

గ్రామీణ ఆసుపత్రుల్లో మెడికోల నిర్బంధ సేవలు..
ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఏ కేటగిరీలో సీట్లు పొందిన పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికోలు వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్బంధంగా వైద్య సేవలు అందించాలనే నిబంధన 2022-23 విద్యా సంవత్సరం నుంచి వర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి  శ్రీమతి భారతీ పవార్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే సబ్ సెంటర్ స్థాయిలో కూడా వైద్యాధికారులు సేవలందించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ట్రయల్ రన్ కూడా ప్రారంభించిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకునేందుకు సరళమైన నిబంధనలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టింగ్ ఇన్, కాంట్రాక్టింగ్ అవుట్ పద్ధతిలో స్పెషలిస్ట్ సర్వీసులు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను ప్రభుత్వ సేవలకు వినియోగించుకోవడం వంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

ఆ విద్యార్థులు పనిచేయాల్సిందే..
జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యులకు ఏరియా అలవెన్సులు, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు వసతి, రవాణా ఖర్చులు వంటి వాటిని ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకునే విధంగా వీలు కల్పించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. డాక్టర్లు, స్పెషలిస్టులను ఆకర్షించే విధంగా జీతభత్యాలు నిర్ణయించుకునే అధికారం కూడా రాష్ట్రాలకు ఇచ్చినట్లు వెల్లడించారు. అందులో  భాగంగానే యువర్ కోట్, యువర్ పే విధానం ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్స్ రెసిడెన్సీ ప్రోగ్రాంను ఆమోదించిందని, ఇందులో భాగంగా పీజీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జిల్లా ఆసుపత్రుల్లో సేవలందించేందుకు మూడు నెలల పాటు నియమిస్తారని వివరించారు. 

Also Read:

విద్యార్థులకు గుడ్ న్యూస్, 5 లక్షల మంది విద్యార్థులకు 'ట్యాబ్‌'లు - ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 5 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్‌ పీఆర్వో పోస్టు భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
 

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget