అన్వేషించండి

CBSE Exams: ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ బోర్డ్‌ పరీక్షలు, అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?

సీబీఎస్సీ బోర్డ్‌ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15 మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వ‌ర‌కు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

CBSC Board Exams: సీబీఎస్సీ బోర్డ్‌ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వ‌ర‌కు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు (Admit Cards) ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు ప్రైవేటుగా పరీక్ష రాస్తున్న వారి అడ్మిట్‌ కార్డులను ఈ వారంలో విడుదల చేయనున్నారు. 

కాగా, ప‌రీక్షకు ప‌రీక్షకు మ‌ధ్య గ్యాప్ ఇవ్వడంతోపాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ ప‌రీక్షల తేదీల‌ను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను రూపొందించారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి, ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్రవరి 28కి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు.

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21కి మార్చారు. పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.

సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచి అమలు..
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల విధానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Central Board Of Secondary Education) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే పరీక్షలను రెండుసార్లు రాయాలా లేదా ఎప్పటిలా ఒకేసారి రాయాలా అనేది విద్యార్ధుల ఇష్టమని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఐచ్ఛికం. విద్యార్థులు రెండు సార్లు తప్పనిసరిగా రాయాలన్న నిర్భంధమేమీ లేదని తెలిపింది. ఒకవేళ రెండు సార్లు పరీక్షలు రాస్తే.. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. ఆ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. 

ఒత్తిడి తగ్గించేందుకే..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ ​తెలిపింది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దాంతో పాటూ రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.

స్పోర్ట్స్, ఒలింపియాడ్‌ విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు..
జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో, అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొంటూ సీబీఎస్‌ఈ(CBSE) 10, 12 తరగతుల పరీక్షలు రాయలేని విద్యార్థుల కోసం సీబీఎస్ఈ బోర్డు ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం రాతపరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. కంపార్ట్‌మెంట్, ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా పరీక్షలను మాత్రం అందరితో కలిపే రాయాల్సి ఉంటుంది. క్రీడలు, ఎడ్యుకేషన్ పోటీల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Priyadarshi: ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు... కత్తి పట్టడానికీ రెడీ... 'సారంగపాణి జాతకం' హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ
ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు... కత్తి పట్టడానికీ రెడీ... 'సారంగపాణి జాతకం' హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Embed widget