By: ABP Desam | Updated at : 08 Apr 2022 06:08 PM (IST)
సీబీఎస్ఈ టర్మ్ 1 రిజల్ట్స్ (Photo: Getty Images)
CBSE 10th Result 2022 Declared: పదో తరగతి టెర్మ్ వన్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Class 10 Result 2022) విడుదల చేసింది. 10వ తరగతి టర్మ్ 1 పరీక్షలో విద్యార్థుల పెర్మార్మెన్స్‌ను పాఠశాలలకు తెలియజేసినట్లు సీబీఎస్‌ఈ శనివారం పేర్కొంది. పాఠశాలల్లో ఇప్పటికే ఇంటర్నల్ అసెస్‌మెంట్/ప్రాక్టికల్ స్కోర్లు అందుబాటులో ఉన్నందున, థియరీ పరీక్షలకు సంబంధించిన స్కోర్‌లు మాత్రమే తెలియజేస్తున్నట్టు సీబీఎస్‌ఈ (CBSE) పేర్కొంది.
స్కూళ్లకు విద్యార్థుల మార్కుల అప్ డేట్..
సీబీఎస్ఈ 10వ తరగతికి సంబంధించిన స్కూల్ కోడ్ సెషన్ 2021-22కి సంబంధించిన టర్మ్ 1 పరీక్ష పనితీరును అటాచ్‌మెంట్‌లో చూసుకోవాలని సీబీఎస్‌ఈ(CBSE) ఇమెయిల్ రిపోర్ట్‌లో పేర్కొంది. నవంబర్-డిసెంబర్ 2021లో జరిగిన టర్మ్ 1 పరీక్షల స్కోర్‌కార్డ్‌లను విడుదల చేసిన బోర్డు విద్యార్థి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది మాత్రం వెల్లడించలేదు. విద్యార్థులు 10వ తరగతి టర్మ్ 1 ఫలితాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in cbseresults.nic.in , cbse.gov.in, results.nic.in లలో అప్‌లోడ్ చేస్తామని, అప్పుడు యాక్సెస్ చేయవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది.
Performance of Term 1 exam of class X has been communicated to the schools by CBSE. Only scores in theory have been communicated as internal Assessment /practical scores are already available with the schools.@EduMinOfIndia @dpradhanbjp @ncert @PTI_News @PIB_India @DDNewslive
— CBSE HQ (@cbseindia29) March 12, 2022
సీబీఎస్ఈ మార్క్ షీట్స్ కోసం టెన్త్ విద్యార్థులకు కావాల్సిన వివరాలు..
విద్యార్థుల పేరు, స్కూల్ పేరు ఎంటర్ చేయాలి
విద్యార్థుల రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి
వీటి ద్వారా థియరీ సబ్టెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆ పేపర్ మొత్తం మార్కుల వివరాలు వస్తాయి
అన్ని పరీక్షలకు కలిపి ఎన్ని మార్కులు వచ్చాయి అనే వివరాలు విద్యార్థులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ లో తెలుసుకోవచ్చునని సీబీఎస్ఈ తెలిపింది.
CBSE టర్మ్ 2 పరీక్షల మోడల్ పేపర్స్:
సీబీఎస్ఈ త్వరలో నిర్వహించనున్న టర్మ్ 2 నమూనా పేపర్, మార్కింగ్ విధానం పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 10వ తరగతి టర్మ్ 1 ఎగ్జామ్స్ మోడల్ పేపర్స్‌ను సీబీఎస్ఈ ఇదివరకే విడుదలల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.inలో పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Also Read; CBSE Term 2 Exams Schedule: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Also Read: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి