అన్వేషించండి

APPSC RIMC: ఇండియన్‌ మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా

RIMC: డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌లో 8తరగతిలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

Rashtriya Indian Military College Admissions 2025 July: ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో  2025 జులై సెషన్‌కు సంబంధించి 8వ తరగతిలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 1న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు...

* రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ - 8వ తరగతి ప్రవేశాలు (జులై సెషన్) 2025

అర్హత: 01.07.2025 నాటికి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఏడోతరగతి ఉత్తీర్ణులు/చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01.07.2025 నాటికి 11.5 - 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.2012 - 01.01.2014 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌, పాత ప్రశ్నపత్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతారు. విద్యార్థులు దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఏపీపీఎస్సీ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుతోపాటు అభ్యర్థులు మున్సిపల్‌ కార్పొరేషన్‌/గ్రామ పంచాయతీ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌; నివాసం, కులం ధ్రువీకరణ పత్రాలు; బోనఫైడ్‌ సర్టిఫికెట్‌; ఆధార్‌ కార్డ్‌; విద్యార్థి 2 ఫొటోలు పంపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, వాయిస్ వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. (లేదా) డిమాండ్ డ్రాఫ్ట్ పంపడం ద్వారా కూడా దరఖాస్తులు పొందవచ్చు. అభ్యర్థులు 'The Commandant RIMC Fund, Drawee Branch, HDFC Bank, Ballapur Chowk, Dehradun, Bank Code 1399, Uttarakhand' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది. 

రాతపరీక్ష విధానం: మొత్తం 400 మార్కులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌ నుంచి 125 మార్కులకు, మ్యాథమెటిక్స్‌ నుంచి 200 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు సమాధానాలను హిందీ లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి వైవా వోస్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఇందులో ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాలు పరీక్షిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రం: విజయవాడ.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Assistant Secretary (Exams), 
APPSC, New Heads of Departments Building, 
2nd Floor, Near RTA Office, Opp: Indira Gandhi Municipal Stadium, 
MG Road, Vijayawada- 520010, Andhra Pradesh.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 30.09.2024.

➥ పరీక్ష తేది: 01.12.2024.

పరీక్ష సమయం:

➥ మ్యాథమెటిక్స్ - ఉ.9.30 గం. – ఉ.11.00 గం. వరకు

➥ జనరల్ నాలెడ్జ్ - మ.12.00 గం.- మ.1.00 గం. వరకు

➥ ఇంగ్లిష్ - మ.2.30 గం.- సా.4:30 గం. వరకు

Notification

Web Note

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget