APMS Halltickets: ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలోని 164 ఆదర్శపాఠశాలల్లో వచ్చేవిద్యాసంవత్సరం 6వ తరగతితలో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు ఏప్రిల్ 10న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు.
![APMS Halltickets: ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే? APMS 6th class Admission Entrance test Hall Tickets released download now APMS Halltickets: ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/5e4cf9b632507c63cf2599cf27db2e431712767660789522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Model School Exam Haltickets: ఏపీలోని 164 ఆదర్శపాఠశాలల్లో (Model Schools) వచ్చేవిద్యాసంవత్సరం (2024-25) 6వ తరగతితలో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు ఏప్రిల్ 10న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఐడీ, పుట్టినతేదీ వివరాలు, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధిస్తారు, చదువుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. ఈ పాఠశాలలన్నీ కూడా సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 5వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో అర్హత మార్కులకు ఓసీ, బీసీ విద్యార్థులకు 35గా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30గా నిర్ణయించారు.
APMS ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
వివరాలు..
* ఆదర్శపాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలు
అర్హతలు: విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలు చదివి ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజుచెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.03.2024. (06.04.2024 వరకు పొడిగించారు)
➥ పరీక్ష తేదీ: 21.04.2024 (ఆదివారం).
పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు.
పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ALSO READ:
నీట్ యూజీ-2024 దరఖాస్తుకు మరో అవకాశం, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2024 పరీక్ష దరఖాస్తుకు మరోసారి 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏప్రిల్ 9, 10 తేదీల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్ 10న రాత్రి 10.50 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఏప్రిల్ 10న రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. మార్చి 16తో నీట్ యూజీ-2024 దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)