AP LAWCET 2022: ఏపీ లాసెట్ వెబ్‌ఆప్షన్లు 28 నుంచి 30 వరకు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
అభ్యర్థులు డిసెంబరు 28 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోదలచిన వారికి డిసెంబరు 31న అవకాశం కల్పిస్తారు. జనవరి 2న సీట్లను కేటాయించనున్నారు.
![AP LAWCET 2022: ఏపీ లాసెట్ వెబ్‌ఆప్షన్లు 28 నుంచి 30 వరకు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే? APLAWCET 2022 Counselling: web options selection window will start from December 28, 2022 to December 30 AP LAWCET 2022: ఏపీ లాసెట్ వెబ్‌ఆప్షన్లు 28 నుంచి 30 వరకు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/eef3e44ced5a0ed2917788cc231cbea41672167801753522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీలోని న్యాయకళాశాలల్లో లాసెట్ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు డిసెంబరు 28 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోదలచిన వారికి డిసెంబరు 31న అవకాశం కల్పిస్తారు. వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు 2023, జనవరి 2న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 3 నుంచి 7 వరకు సంబంధిత కళాశాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జనవరి 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
వెబ్ ఆప్షన్ల నమోదు కోసం క్లిక్ చేయండి..
ఏపీ లాసెట్ 2022 కౌన్సెలింగ్ డిసెంబరు 3న ప్రారంభమైన సంగతి తెలిసిందే. డిసెంబరు 3 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. డిసెంబరు 4 నుండి 12 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. డిసెంబరు 12న స్పెషల్ కేటగిరి అభ్యర్ధుల సరిఫికెట్లను ఫిజికల్‌గా నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహించారు. అయితే డిసెంబరు 13 నుండి 15 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా ఆలస్యమైంది. దీంతో డిసెంబరు 28 నుంచి 30 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీ లాసెట్ 3 ఏళ్ల కోర్సుకు 90.81శాతం, లాసెట్ 5 ఏళ్ల కోర్సుకు 79.51శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండేళ్ల పీజీ ఎల్ సెట్లో 97.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. లాసెట్‌లో మహిళలకే అత్యధిక ర్యాంకులు రావడం విశేషం. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం జులై 13న ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్- 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 709 మంది రిజిస్టర్ చేసుకోగా.. 13 వేల 180 మంది హాజరై పరీక్ష రాశారు. 2 వేల 529 మంది గైర్హాజరు కాగా.. హాజరు శాతం 83.9 శాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2022 పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి మే 13 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలను జులై 13న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించారు. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా, కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల ఆప్షన్ల మేరకు సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.
Also Read:
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇవే! ఈ సారి ఎన్నిరోజులంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో సంక్రాంతి సెలవుల గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. ఏపీలోని జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తెలంగాణలో సంక్రాంతి సెలవుల వివరాలు ఇలా..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)