అన్వేషించండి

AP PGCET: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023 ఫలితాలు జులై 14న విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023 ఫలితాలు జులై 14న విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, ఫోన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి జూన్‌ 10 వరకు ఏపీ పీజీసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏపీ పీజీసెట్ ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..

ఈ ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్‌ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. ఈ రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు.

ALSO READ:

టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget