అన్వేషించండి

YSRUHS: నేటితో ముగియనున్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ దరఖాస్తు గడువు

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రకియ బుధవారం(జులై 26) సాయంత్రంతో ముగియనుంది.

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రకియ బుధవారం(జులై 26) సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నీట్‌(యూజీ)-2023 అర్హత సాధించిన అభ్యర్థులు జులై 26న సాయంత్రం 6 గంటల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,872 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, వారిలో 12,432 మంది ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత సీట్లు పొందిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటించనుంది. తదనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి 3856 ఎంబీబీఎస్ సీట్లను, 819 బీడీఎస్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ జులై 21న ప్రవేశ ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

వివరాలు..

* ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు - కాంపిటెంట్ అథారిటీ కోటా

అర్హత: ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నీట్‌ యూజీ-2023 ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 

నీట్‌ కటాఫ్ మార్కులు కేటగిరీలవారీగా ఇలా..

➥ జనరల్‌ (ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌) - 137 మార్కులు (50 పర్సంటైల్).

➥ ఎస్సీ/ఎస్టీ/బీసీ, ఎస్సీ/బీసీ (దివ్యాంగులు) - 107 మార్కులు (40 పర్సంటైల్).

➥  ఎస్టీ(దివ్యాంగులు)- 108 మార్కులు (40 పర్సంటైల్).

➥ ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌(దివ్యాంగులు): 121 మార్కులు (45 పర్సంటైల్).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2360 చెల్లించాలి. దీనికి బ్యాంకు ఛార్జీలు అదనం. డెబిట్‌ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్‌బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 

ఎంపిక విధానం: నీట్ యూజీ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా.

అవసరమయ్యే డాక్యుమెంట్లు..

  • ఆధార్ కార్డు
  • నీట్ యూజీ 2023 ర్యాంకు కార్డు
  • పదోతరగతి మార్కుల మెమో (పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)
  • ఇంటర్ లేదా తత్సమాన అర్హత మార్కుల మెమో (క్వాలిఫైయింగ్ ఎగ్జామ్)
  • 6 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు
  • ఇంటర్ లేదా తత్సమాన స్టడీ సర్టిఫికేట్
  • ఇంటర్ లేదా తత్సమాన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (ఇంటర్ టీసీ)
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • మైనార్టీ సర్టిఫికేట్ (ముస్లిమ్స్ మాత్రమే)
  • ఇన్‌కమ్ సర్టిఫికేట్-ఈడబ్ల్యూఎస్ (01.04.2023) తర్వాత జారీచేసినదై ఉండాలి.
  • తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికేట్/ తెల్లరేషన్ కార్డు
  • దివ్యాంగులైతే PwBD సర్టిఫికేట్
  • NCC సర్టిఫికేట్
  • క్యాప్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • పోలీస్ మార్టైర్ చిల్డ్రన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • రెసిడెన్స్ సర్టిఫికేట్(నాన్‌లోకల్ అభ్యర్థులకు)
  • లోకల్ స్టేటస్ సర్టిఫికేట్
  • అభ్యర్థుల పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సంతకం ఫొటో

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 20.07.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 26.07.2023.

Notification

Prospectus

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
Embed widget