AP LAWCET Rank Card: ఏపీ లాసెట్ ఫలితాలు వెల్లడి, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలతోపాటు లాసెట్ ర్యాంకు కార్డును కూడా విడుదల చేశారు.
ఏపీలాసెట్ 2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆగస్టు 5 సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలతోపాటు లాసెట్ ర్యాంకు కార్డును కూడా విడుదల చేశారు. లాసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలతోపాటు, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉత్తీర్ణత శాతం ఇలా..
లాసెట్ 3 ఏళ్ల కోర్సుకు 90.81శాతం, లాసెట్ 5 ఏళ్ల కోర్సుకు 79.51శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండేళ్ల పీజీ ఎల్ సెట్లో 97.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. లాసెట్‌లో మహిళలకే అత్యధిక ర్యాంకులు రావడం విశేషం.
AP LAWCET & AP PGLCET - 2022 Results
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం జులై 13న ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్- 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 709 మంది రిజిస్టర్ చేసుకోగా.. 13 వేల 180 మంది హాజరై పరీక్ష రాశారు. 2 వేల 529 మంది గైర్హాజరు కాగా.. హాజరు శాతం 83.9 శాతం నమోదైంది.
Also Read: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!
ఆంధ్రప్రదేశ్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2022 పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి మే 13 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలను జులై 13న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించారు. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా, కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల ఆప్షన్ల మేరకు సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.
Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
క్వాలిఫై మార్కులు, ర్యాంకిగ్ విధానం ఇలా..
ఏపీ లాసెట్ అర్హత సాధించాలంటే 35 శాతం కనీస మార్కులు తప్పనిసి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 42 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశపరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మార్కుల సమానమయ్యే అభ్యర్థులకు సెక్షన్-సిలో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు అవసరంలేదు.
Also Read: ఆగస్టు 6న జేఈఈ మెయిన్ తుది ఫలితాలు, తుది 'కీ' ఎప్పుడంటే?
పీజీఎల్ సెట్ అర్హత సాధించాలంటే 25 శాతం కనీసం మార్కులు తప్పనిసరి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 30 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మార్కుల సమమయ్యే అభ్యర్థులకు పార్ట్-ఎలో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమానమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా చేసుకుని తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు అవసరంలేదు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..