By: ABP Desam | Updated at : 26 Apr 2023 12:39 AM (IST)
Edited By: omeprakash
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయర్ గాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించింది. కాగా, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుండి ఫలితాలను చెక్ చేయవచ్చని బోర్డు సూచించింది. ఫలితాలను bieap.apcfss.in, bie.ap.gov.in, results.bie.ap.gov.inతో పాటు పలు వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫలితాలను https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో కూడా చూసుకోవచ్చు.
Also Read:
దూరవిద్య బీఈడీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సాధారణ డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు. అయితే ఇంజినీరింగ్‌లో సైన్స్/ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రూ.500 ఆలస్య రుసుముతో మే 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సు వివరాల గురించి క్లిక్ చేయండి..
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
NLSIU Courses: ఎన్ఎల్ఎస్ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!
పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్ పెంచిన సర్కార్ - ఎంత శాతమంటే?
CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
NITW MBA Admissions: నిట్ వరంగల్లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!