Inter Marks Memo: ఇంటర్ మార్కుల మెమోలు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Memos: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థుల షార్ట్ మెమోలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి షార్ట్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 12న ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 8,55,030మంది పరీక్షలు రాయగా.. ప్రథమ సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్ చేయండి..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్ చేయండి..
ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మే 15 నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలు..
ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియను మే 15 నుంచి ప్రారంభించనున్నారు. రెండు విడతలుగా ప్రవేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో మే 15 నుంచి దరఖాస్తులు విక్రయించి, జూన్ 1 లోపు వాటిని స్వీకరిస్తారు. ఇక మే 22 నుంచి మొదటి విడత ప్రవేశాలు చేపట్టాలని, జూన్ 1 లోపు పూర్తి చేయనున్నారు. రెండో విడత ప్రవేశాలను జూన్ 10 నుంచి జులై 1 లోపు పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలు వెల్లడి..
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. జనరల్, ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు రాయదల్చినవారు రూ.550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఫీజు రూ.550తోపాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాలని బోర్డు పేర్కొంది. అదేవిధంగా బ్రిడ్జికోర్సు పేపర్లు రాసేందుకు రూ.150 చెల్లించాలని సూచించింది. ఇక ప్రాక్టికల్స్ పరీక్ష ఫీజును రూ.250గా నిర్ణయించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరుకావాల్సినవారు ఈ మేరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఇక జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌కు రూ.1,300, రీకౌంటింగ్‌కు రూ.260 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌లో ఫెయిల్ అయినా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు, విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు.
మే 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు..
ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనుండగా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. మే 1 నుంచి 4 వరకు సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 18 నుంచి ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం..
ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ద్వారా మరోసారి మార్కుల మూల్యాంకనం, రీవెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రాల స్కానింగ్ కాపీలు, జవాబుపత్రాల వెరిఫికేషన్ కోరవచ్చు.