Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
13 Student Debarred for Copying: బోర్డ్ ఎగ్జామ్స్‌లో కాపీయింగ్ చేస్తున్న 13 మంది ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. పార్వతీ పురం మన్యం జిల్లా మంగళవారం విద్యార్థులను డిబార్ చేశారు.
AP Inter Exams 2022: బోర్డ్ పరీక్షలో కాపీయింగ్ చేస్తున్న 13 మంది ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీ పురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) సాలూరు మండలం బొడ్డవలస - డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల(సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల)లో ఈనెల ఆరో తేదీ నుండి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులకు ఈ పరీక్షా కేంద్రాన్ని కేటాయించగా ప్రిన్సిపాల్ మూఢడ్ల తిరుపతి రావు తగిన ఏర్పాట్లు చేసి 15గదులను కేటాయించారు.
ఈ సెంటర్లలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బంది మంగళవారం పరీక్షా కేంద్రానికి వచ్చింది. కొంతమంది విద్యార్థులు చూచిరాత, కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని పరిశీలకులకు సందేహం రావడంతో సెంటర్లో అన్ని గదులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. 13 మంది విద్యార్థులు (AP Inter Students) స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే వారి వద్ద ఉన్న స్లిప్పులతో పాటు ప్రశ్న, జవాబు పత్రాలను తీసుకొని, వారిని పరీక్షల నుండి డిబార్ చెయ్యాలని ప్రిన్సిపాల్ తిరుపతి రావుకి సూచించారు. ఆ మేరకు ప్రిన్సిపాల్ 13 మంది ఇంటర్ విద్యార్థులని డిబార్ చేయగా.. వారిలో ఇద్దరు బాలికలు ఉన్నారు.
Also Read: Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
Also Read: TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్