అన్వేషించండి

AP ICET Application: ఏపీ ఐసెట్-2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP ICET 2025: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 13న ప్రారంభమైంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోచ్చు.

APICET 2025 Application: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 నోటిఫికేషన్ మార్చి 10న వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 13న ప్రారంభమైంది. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.

రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి 19 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే రూ.10000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 నుంచి 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 29, 30 తేదీల్లో అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 7న ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు మే 2 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 

వివరాలు..

* ఏపీ ఐసెట్-2025

కోర్సుల వివరాలు..

1) ఎంసీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

2) ఎంబీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయోపరిమితి: 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లిస్తే సరిపోతుంది. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).

ఏపీ ఐసెట్-2025 ముఖ్యమైన తేదీలు: 

➽ ఏపీఐసెట్-2025 నోటిఫికేషన్:  10.03.2025.

➽ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 13.03.2025. 

➽ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 09.04.2025.

➽ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 10.04.2025 - 14.04.2025.

➽ రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 15.04.2025 - 19.04.2025.

➽ రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 20.04.2025 - 24.04.2025.

➽ రూ.10000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 25.04.2025  - 28.04.2025.

➽ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం: 29.04.2025 - 30.04.2025.

➽ పరీక్ష హాల్‌టికెట్లు: 02.05.2024 నుంచి అందుబాటులో. 

➽ ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: 07.05.2025.
పరీక్ష సమయం: 09.00 AM - 11.30AM, 02.00 PM to 04.30 PM

➽ ప్రిలిమినరీ ఆన్సర్ కీ: 10.05.2025 – 05.00 PM

➽ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 12.05.2025 – 05.00 PM

➽ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: 21.05.2025.

Notification

Detailed Notification

Online Application

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Advertisement

వీడియోలు

భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
Embed widget