News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP DSC Notification: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్!

ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

FOLLOW US: 
Share:

ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం (ఏప్రిల్ 21) తెలిపారు.  దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని బొత్స చెప్పారు. ఇదే అంశాన్ని ఒప్పంద అధ్యాపకులకు చెప్పామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామన్నారు. 

డీఎస్సీ నోటిఫికేషన్ విషయంపై సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి బొత్స తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నామని.. సీఎం జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని బొత్స తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం పాఠశాలల్లో పరీక్షలు, ఒంటి పుట బడులు జరుగుతున్నాయని. అందువల్లనే చిక్కిలు ఇస్తున్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

మూడు రాజధానులపై ఏమన్నారంటే?
మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ అది తమ పార్టీ, ప్రభుత్వ విధానమని మంత్రి పునరుద్ఘాటించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీసుకురావడం జగన్‌ సర్కార్ పాలసీ అని తెలిపారు. మేము ఎవ్వరినీ డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టాడా..? అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటో? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు.. నేను ముందే చెప్పాను. ఈరోజు బిడ్డింగ్‌తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు మా ప్రభుత్వం వ్యతిరేకం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు మంచి నటుడు, మ్యానిపులేటర్‌. తన తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు’ అని మంత్రి బొత్సా అన్నారు.

Also Read:

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 'నైట్‌ వాచ్‌మన్' పోస్టుల మార్గదర్శకాలు జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో ‘మనబడి నాడు–నేడు’ పథకంలో భాగంగా వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరు­గు­పరచడానికి ప్రభుత్వం 2020–21 నుంచి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆయా పాఠశాలల్లో దశల వారీగా టాయి­లెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతు­లు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, విద్యా­ర్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, ప్రహరీ, కిచెన్‌ షెడ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 21 Apr 2023 05:02 PM (IST) Tags: AP DSC Recruitment AP DSC Notification DSC 2023 Notfication Minister Botsa Satya Narayana

ఇవి కూడా చూడండి

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

KNRUHS: కటాఫ్‌ స్కోర్‌ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్

KNRUHS: కటాఫ్‌ స్కోర్‌ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్

MANAGE: మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు, వివరాలు ఇలా

MANAGE: మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు, వివరాలు ఇలా

NITT: నిట్‌ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, ఈ అర్హతలుండాలి

NITT: నిట్‌ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, ఈ అర్హతలుండాలి

Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చెయ్యొచ్చు

Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చెయ్యొచ్చు

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్‌ సస్పెన్డ్‌

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్‌ సస్పెన్డ్‌

Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్‌

Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్‌

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?