AP EDCET - AP LAWCET Results : ఏపీ ఎడ్‌సెట్, లాసెట్ ఫలితాలు విడుదల - ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!
ఫలితాలతోపాటు ఎడ్‌సెట్, లాసెట్ ర్యాంకు కార్డులను కూడా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎడ్‌సెట్, ఏపీ లాసెట్ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జులై 13న నిర్వహించిన సంగతి తెలిసిందే.

AP EDCET Results 2022: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు ఆగస్టు 5న విడుదలయ్యాయి. రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ అర్హత పరీక్షను జులై 13న నిర్వహించారు. ఫలితాల్లో మొత్తం 96.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఎడ్‌సెట్ ఫలితాలతోపాటు లాసెట్ ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు. ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులను కూడా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎడ్‌సెట్, ఏపీ లాసెట్ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జులై 13న నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు..
Also Read: ఆగస్టు 6న జేఈఈ మెయిన్ తుది ఫలితాలు, తుది 'కీ' ఎప్పుడంటే?
AP LAWCET 2022 ఫలితాలు...
AP LAWCET & AP PGLCET - 2022 Results





















