By: ABP Desam | Updated at : 10 Sep 2021 02:52 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్ ) - 2021 పరీక్ష హాల్‌టికెట్లు ఈ రోజు (సెప్టెంబర్ 10) విడుదలయ్యాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఈ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏపీ ఎడ్‌సెట్ పరీక్షలను ఈ నెల 21న నిర్వహించనున్నట్లు వర్సిటీ తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో (ఎంసీక్యూ ఫార్మెట్) పరీక్ష జరగనుంది. ఎడ్‌సెట్ పరీక్షను 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు (ఒకే సెషన్) పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కే.విశ్వేశ్వరరావు తెలిపారు. పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ సహా మరిన్ని వివరాల కోసం ఎడ్‌సెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఏపీ ఎడ్‌సెట్ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోండిలా..
మాక్ టెస్ట్ సదుపాయం కూడా ఉంది...
ఎడ్‌సెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం మాక్ టెస్ట్ సదుపాయం కూడా కల్పించారు. దీని కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. దీనిలో మాక్ టెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే.. బయోలజీ, ఫిజిక్స్, సోషల్, మాథ్స్, ఇంగ్లిష్ అనే ఐదు సబ్జెక్టులు కనిపిస్తాయి.. మీకు కావాల్సిన సబ్జెక్టును ఎంచుకుని మాక్ టెస్ట్ రాయవచ్చు. పరీక్ష సమయం 120 నిమిషాలుగా ఉంది. బీఏ /బీఎస్సీ /బీఎస్సీ (హోం సైన్స్) /బీసీఏ/ బీకాం /బీబీఎం పూర్తి చేసిన లేదా చివరి ఏడాదిలో ఉన్న అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్‌లో 55 శాతం మార్కులతో పాస్ అయిన వారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కోర్సుల్లో చేరవచ్చు.
ఎడ్‌సెట్ పరీక్ష కేంద్రాలు..
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, కడప, భీమవరం, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళంలలో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
TS TET 2023 Results: తెలంగాణ 'టెట్' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే
TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
/body>