News
News
X

Court Exam Hall Tickets:జిల్లా కోర్టు ఉద్యోగ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే!

పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబరు 16న అధికారులు విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పుట్టినతేది వివరాల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 21 నుంచి జనవరి 2 వరకు నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. పోస్టుల ఆధారంగా తగినన్ని షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను శుక్రవారం (డిసెంబరు 16) అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్షల షెడ్యూలు ఇలా...

పోస్టు పేరు సెషన్లు పరీక్ష తేది
స్టెనోగ్రాఫర్/జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్/ ఫీల్డ్ అసిస్టెంట్ (కామన్ టెస్ట్) 12 సెషన్లలో 21.12.2022 (3 షిఫ్టుల్లో)

22.12.2022 (3 షిఫ్టుల్లో)

23.12.2022 (1 షిఫ్టు - మార్నింగ్)

29.12.2022 (2 షిఫ్టుల్లో)

02.01.2023 (3 షిఫ్టుల్లో)
కాపీయిస్ట్/ఎగ్జామినర్/రికార్డ్ అసిస్టెంట్ (కామన్ టెస్ట్) 2 సెషన్లలో 26.12.2022 (1 షిఫ్టుల్లో)
డ్రైవర్/ ప్రాసెస్ సర్వర్/ ఆఫీస్ సబార్డినేట్ (కామన్ టెస్ట్) 8 సెషన్లలో 26.12.2022 (1 షిఫ్టులో)

27.12.2022 (3 షిఫ్టుల్లో)

28.12.2022 (3 షిఫ్టుల్లో)

29.12.2022 (1 షిఫ్టులో)

ప్రకటించిన 3432 పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్-1520, జూనియర్ అసిస్టెంట్-681, ప్రాసెస్‌ సర్వర్-439, కాపీయిస్ట్-209, టైపిస్ట్-170, ఫీల్డ్ అసిస్టెంట్-158, ఎగ్జామినర్-112, స్టెనోగ్రాఫర్-114 పోస్టులు ఉండగా.. మిగతావి రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకీ అక్టోబరు 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 11 వరకు అవకాశం కల్పించారు. ఇక అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.800 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించారు.

పోస్టుల వివరాలు ఇలా..

జిల్లా కోర్టు ఖాళీలు: 3432

ఆఫీస్ సబార్డినేట్: 1520  పోస్టులు

➥ జూనియర్ అసిస్టెంట్: 681 పోస్టులు

➥ ప్రాసెస్ సర్వర్: 439 పోస్టులు

➥ కాపీయిస్ట్: 209 పోస్టులు

➥ టైపిస్ట్: 170 పోస్టులు

➥ ఫీల్డ్ అసిస్టెంట్: 158 పోస్టులు

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 114 పోస్టులు

➥ ఎగ్జామినర్: 112 పోస్టులు

➥ డ్రైవర్(లైట్ వెహికిల్): 20 పోస్టులు

➥ రికార్డ్ అసిస్టెంట్: 09 పోస్టులు


Also Read:

ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల పరిధిలో 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నవంబరు 30న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. 
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 16 Dec 2022 10:06 PM (IST) Tags: AP District Court Jobs AP Court Jobs District Court Jobs Recruitment AP District Court Jobs Exam Schedule Court Exam Dates

సంబంధిత కథనాలు

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!