అన్వేషించండి

Degree Admissions: ముగిసిన డిగ్రీ తుది దశ కౌన్సెలింగ్, సగానికి పైగా సీట్లు ఖాళీనే!

మొత్తం 3,46,777 సీట్లకుగాను మూడు విడతల కౌన్సెలింగ్‌ల తర్వాత 1,42,478 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే డిగ్రీ కోర్సుల్లో సగం సీట్లు కూడా భర్తీకాలేదు. కేవలం 41 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి.

ఏపీలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 20తో ముగిసింది. నవంబరు 20న అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో 84,549 సీట్లు; రెండో విడత కౌన్సెలింగ్‌లో 38,645 సీట్లు భర్తీకాగా.. చివరిదైన మూడో విడతలో 18,284 సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో మొత్తం 3,46,777 సీట్లకుగాను మూడు విడతల కౌన్సెలింగ్‌ల తర్వాత 1,42,478 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే డిగ్రీ కోర్సుల్లో సగం సీట్లు కూడా భర్తీకాలేదు. కేవలం 41 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఏకంగా 2,04,299 సీట్లు మిగిలిపోయాయి.

తొలి విడత కౌన్సెలింగ్‌లో 84,549 మందికి సీట్లను కేటాయించారు. రెండోవిడత కౌన్సెలింగ్‌లో 38,645 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించగా.. ఇక చివరిదైన మూడో విడత కౌన్సెలింగ్‌లో 18,284 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

ప్రభుత్వ కళాశాలల్లో 57,061 సీట్లు ఉండగా 26,227 మంది ప్రవేశాలు పొందారు. ప్రైవేటు ఎయిడెడ్‌లో 23,939 సీట్లకు 7276, ప్రైవేటులో 2,62,970 సీట్లకు 1,06,650 మంది చేరారు. యూనివర్సిటీ కళాశాలల్లో 2,804 సీట్లకు 1,325 భర్తీ అయ్యాయి. డిగ్రీలో మొత్తం 22 కోర్సులు ఉండగా మూడు కోర్సుల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. బీఎస్సీలో 62,429, బీకాంలో 51,395, బీఏలో 11,914, బీబీఏలో 5,585 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

సీట్లకేటాయిపు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం మూడో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబరు 11 నుంచి 14 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అదే తేదీల్లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించారు. నవంబరు 15 నుంచి 16 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి నవంబరు 20న సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సీటు అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని, సంబంధిత కళాశాలలో నవంబరు 22లోగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కళాశాలలో ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించి సీటు కేటాయింపును ధ్రువీకరిస్తారు.

Also Read:

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తోంది. ప్రవేశాలు కోరే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని  వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నవంబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'యూగో'తో అమ్మాయిల చదువు 'గో-ఎహెడ్'! స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం!
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిల చదువు కోసం మేమున్నామంటూ ముందుకొస్తుంది ‘యూగో (U-Go)’ అనే స్వచ్ఛంద సంస్థ. స్కాలర్‌షిప్ ప్రోగ్రామింగ్ ద్వారా చేయూత అందిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ‘గివ్‌ఇండియా’తో కలిసి ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. కాలిఫోర్నియాకు చెందిన ‘యూగో’ అనేది స్వచ్ఛంద సంస్థ. ఏడు దేశాల్లోని ఆర్థికంగా వెనకబడిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తోంది. 
స్కాలర్‌‌షిప్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
IPL 2024: ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
Vishal : రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
Embed widget